Komatireddy: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీతేజ్ ను చూసేందుకు కిమ్స్ ఆస్పత్రికి బయలుదేరారు. అక్కడ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని.. అతడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి అసెంబ్లీ వేదికగా శ్రీతేజ్ వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అలాగే తాను వ్యక్తిగతంగా కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ తరుపున రూ. 25 లక్షల ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి చెక్కును శ్రీతేజ్ తండ్రికి అందజేయనున్నారు.
Also Read: 'భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్
అల్లు అర్జున్ వల్లే..
అయితే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి కూడా సంధ్య థియేటర్ ఘటన పై స్పందించారు. అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని అన్నారు. అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ మండిపడ్డారు. బాధ్యులెవరైనా వదిలేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున 25 లక్షల రూపాయలు విరాళం అందిస్తున్నా..
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 21, 2024
అలాగే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారి అబ్బాయి శ్రీతేజ్ కోలుకునేంత వరకు పూర్తి ఆరోగ్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. pic.twitter.com/RJqu77yoi6
ఇది ఇలా ఉంటే.. నిన్న కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీతేజ్ స్పృహలోకి వచ్చినట్లు తెలిపారు. కళ్ళు తెరిచినప్పటికీ ఎవరినీ గుర్తుపట్టడం లేదట. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
Also Read: లవర్ కోసం 3 మహా సముద్రాలు దాటిన మగ తిమింగలం.. ఈ కథ వింటే మీరూ ప్రేమలో పడతారు