/rtv/media/media_files/2025/11/08/akhanda-2-2025-11-08-14-40-50.jpg)
Akhanda 2
Akhanda 2: బాలకృష్ణ(Balakrishna) - బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ భారీ అంచనాలే ఉంటాయి. ఈ కాంబో కలసి చేసిన అఖండ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే కాంబో మళ్లీ అఖండ 2: తాండవం అనే సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Akhanda 2 Advance Bookings
ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుంచే స్పందన చాలా బాగుంది. ప్రీమియర్ షోల కోసం ఇప్పటివరకు సుమారు $30 వేల వరకు కలెక్షన్ నమోదైంది. నవంబర్ 14న విడుదల కాబోయే మొదటి పాటతో బుకింగ్స్ మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది.
Also Read : ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్.. త్వరలోనే పెళ్లి!
తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆయన ట్యూన్స్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. హీరోయిన్‌గా సమ్యూక్త నటించగా, బాలీవుడ్ చిత్రం బజరంగీ భాయీజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఆమె పాత్ర ఈ సినిమాలో ముఖ్యంగా ఉండబోతోందని సమాచారం.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీనాథ్ అచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ మళ్లీ పౌరాణిక టచ్ ఉన్న పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారని టీజర్‌లోనే అర్ధమవుతోంది.
Also Read : ‘రేసుగుర్రం నటుడిని చంపేస్తాం’.. గ్యాంగ్‌స్టర్ మాస్ వార్నింగ్..!
ఇక ఇటీవలే విడుదలైన తాండవం సాంగ్ ప్రోమో ప్రేక్షకుల్లో మంచి హైప్ సృష్టించింది. ఈ సాంగ్‌కి విజువల్స్, తమన్ ఇచ్చిన బీట్‌లు బాలయ్య ఎనర్జీకి సరిపోయేలా ఉన్నాయని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అఖండ 2: తాండవం పై అభిమానులు, ట్రేడ్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్ మళ్లీ ఏ రేంజ్‌లో గర్జిస్తుందో చూడాలి.
Follow Us