షాకింగ్ ఘటన .. 80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్

జార్ఖండ్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. దీనిపై విద్యార్థినులు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతోంది.

New Update
school girls

school girls Photograph: (school girls)

జార్ఖండ్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. ధన్‌బాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ పరీక్షలు ముగియడంతో విద్యార్థినులు ‘పెన్ డే’ నిర్వహించారు. ఒకరి చొక్కాలపై మరొకరు సంతకం చేసుకున్నారు. ఇది చూసిన ప్రిన్సిపల్ వారి చొక్కాలను విప్పించారు.  బ్లేజర్లతోనే విద్యార్థినులను ఇంటికి పంపారు.  ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్‌తో కలిసి డీసీ మాధవి మిశ్రాను కలిశారు. 

మాధవి మిశ్రాకు విద్యార్థినులు  తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుల ప్రకారం పాఠశాల ప్రిన్సిపాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఇలాంటి అవమానాలు బాలికల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యార్థినుల గౌరవం, శ్రేయస్సును నిలబెట్టాల్సిన ప్రిన్సిపాల్ ఇలాంటి పనులు చేయడం ఊహించలేమని బాధిత తల్లిదండ్రులలో ఒకరు అన్నారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.

నలుగురు సభ్యులతో కూడిన కమిటీ

ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఈ చర్యను ఖండిస్తూ, ప్రిన్సిపాల్ ప్రవర్తన ఈ అమ్మాయిల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇది సిగ్గుచేటు, దురదృష్టకరమని అన్నారు.  విచారణ కోసం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేయనున్నట్లు డీసీ మాధవి మిశ్రా ప్రకటించారు.

" మేము అనేక మంది నుండి ఫిర్యాదులను స్వీకరించాము. కొంతమంది బాధిత విద్యార్థులతో మాట్లాడాము. ఈ వ్యవహారాన్ని అధికార యంత్రాంగం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. దర్యాప్తు ప్యానెల్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోబడతాయి” అని డిసి మిశ్రా అన్నారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాలతో కూడిన ప్యానెల్ మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతోంది.

Also Read :  'గేమ్ ఛేంజర్' కు ప్రభుత్వం బిగ్ షాక్.. ఆ షోలు రద్దు

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు