Unstoppable : బాలయ్యతో వెంకీమామ.. 'అన్ స్టాపబుల్' ప్రోమో అదుర్స్

బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకి విక్టరీ వెంకటేష్ అతిథిగా విచ్చేశారు. తాజాగా ఆహా ఈ ఏడవ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో బాలయ్య, వెంకీల ఫన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇదే ఎపిసోడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా సందడి చేశారు.

New Update

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్' టాక్ షో ఆహా ఓటీటీ వేదికపై విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌ను ప్రసారం చేస్తోంది. ఈ సీజన్‌లో ఆరు అప్పుడే ఆరు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. 

ఏడవ ఎపిసోడ్‌కు విక్టరీ వెంకటేష్ అతిథిగా విచ్చేశారు. ఆయన నటిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఆహా ఈ ఏడవ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో బాలకృష్ణ, వెంకటేష్‌ను వేదికపైకి ఆహ్వానించారు.

' పోటీనా మనం... ఒకరికి ఒకరికి' అంటూ బాలకృష్ణ వెంకటేష్‌ను ప్రశ్నించగా, దానికి వెంకటేష్ 'ఎక్కడమ్మా పోటీ?' అని బదులిచ్చారు. ప్రోమోను చూస్తుంటే, ఈ ఎపిసోడ్‌లో సరదా కబుర్లతో పాటు కొన్ని ఎమోషనల్ విషయాలను కూడా వెంకటేష్ పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమో చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కనిపించారు. డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు ఆహాలో  ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు