Ram Charan: రెండు రోజుల క్రితం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆహ్వానం మేరకు మెగా హీరో రామ్ చరణ్ కడప పెద్ద దర్గాను సందర్శించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అయితే చరణ్ అయ్యప్ప మాలలో ఉండగానే.. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా ముషాయిర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ దర్గాలో చాదర్ కూడా సమర్పించారు. దీంతో దీక్షలో ఉండగానే దర్గాకు ఎలా ఎలా వెళ్తారని చరణ్ పై తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ప్రతినిధులు మండిపడుతున్నారు.
Also Read: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి
క్షమాపణలు చెప్పాలి
దర్గాకు వెళ్లి హిందువులు, అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప జేఏసీ రాష్ట్ర కన్వీనర్, గురుస్వామి నాయని బుచ్చిరెడ్డి మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారని రాంచరణ్ ను ప్రశ్నించారు. ఏదైనా అశుభం జరిగినప్పుడు మాత్రమే మాల, బొట్టు తీస్తారని.. అలాంటిది దర్గా లోపలికి వెళ్లే సమయంలో చరణ్ నుదిటి పై బొట్టును తుడిపించారని ఆరోపించారు. మాలలో చరణ్ దర్గాకు వెళ్లడంపై వివరణ ఇవ్వాలని, అలాగే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: టాయిలెట్ పై కూర్చొని గంటలు గంటలు గర్ల్ ఫ్రెండ్ తో సొల్లేస్తున్నారా..? జాగ్రత్త
Also Read : ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!
Also Read: ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన!