Thamma Paid Premieres: 'థామ' సినిమా కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్.. మ్యాటరేంటంటే?

అక్టోబర్ 21న వస్తోన్న 'థామ' సినిమాకు అక్టోబర్ 20న పేడ్ ప్రివ్యూలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయుష్మాన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీపై మంచి బజ్ ఉంది. పాజిటివ్ టాక్ వస్తే విడుదలకు ముందే మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

New Update
World of Thama

Thamma Paid Premieres

Thamma Paid Premieres: మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో వచ్చే కొత్త సినిమా 'థామ' ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 21, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది.

Also Read: వర్త్ వర్మా వర్తు..!! ‘డ్యూడ్’ సినిమా రివ్యూ ఇదిగో..!

Thamma Paid Premieres

తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సినిమాకు విడుదల రోజుకి ముందే పేడ్ ప్రివ్యూలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వెబ్‌సైట్ పింక్‌విల్లా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, అక్టోబర్ 20న దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద మల్టీప్లెక్స్‌లలో ఈ ప్రివ్యూలు నిర్వహించనున్నారు.

Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!

ఇలా విడుదలకు ముందే సినిమా చూసే అవకాశం కల్పించడం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని, ముఖ్యంగా ‘స్త్రీ 2’ సినిమా ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ 'థామ' సినిమాకి కూడా వస్తుందని  నిర్మాతలు భావిస్తున్నారు. ప్రేక్షకులు సినిమాకి పాజిటివ్ టాక్ ఇస్తే మొదటి రోజే మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

Also Read: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!

ఈ సినిమాలో ఆయుష్మాన్, రష్మికలతో పాటు నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేష్ రావల్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఇక హైలైట్ విషయమైతే, వరుణ్ ధవన్ తన ‘భేడియా’ పాత్రలో స్పెషల్ కెమియోలో కనిపించనున్నాడు. దీంతో సినిమాపై ఇంట్రస్ట్ ఇంకా పెరిగింది.

మొత్తానికి, 'థామ' సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. మేకర్స్ ప్లాన్ చేస్తున్న పేడ్ ప్రివ్యూలు సక్సెస్ అయితే, సినిమా విడుదలకు ముందే మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కథ, కామెడీ, హారర్ లాంటి అంశాలతో ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అన్నది అక్టోబర్ 21న తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు