Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!

రవితేజ మేనల్లుడు అవినాశవర్మ నటించిన లేటెస్ట్ మూవీ 'జగమెరిగిన సత్యం'. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలోని రియల్ లొకేషన్స్, ఎమోషన్స్ పల్లె ప్రకృతిని, సంస్కృతిని ప్రతిభింభిస్తూ ఆహ్లాదకరంగా ఉన్నాయి. 

New Update

Jagamerigina Satyam: మాస్ మహారాజ రవితేజ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన మేనల్లుడు అవినాష్ వర్మ  'జగమెరిగిన సత్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందింది. పాలే తిరుపతి దర్శకత్వంలో అవినాష్,  ఆద్యారెడ్డిలను హీరో, హీరోయిన్లుగా  నటించగా .. సెకండ్ ఫీమేల్ లీడ్ గా నీలిమ పథకం శెట్టి నటించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ 

ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని మారుమూల గ్రామం  'దింది' లోని  కట్టుబాట్లు, ఆచారాలను ప్రతిభింభిస్తూ..  అదే సమయంలో ఓ అందమైన ప్రేమ కథను జోడించారు. 1994  తెలంగాణ‌లో  జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 80 శాతం చిత్రీకరణ దింది గ్రామంలోనే  చిత్రీకరించారు. సినిమాలోని రియల్ లొకేషన్స్ పల్లె ప్రకృతిని ప్రతిభింబిస్తున్నాయి. సత్యం, సరిత ఇద్దరు ప్రేమికుల చుట్టూ  కథ తిరుగుతుంది. సత్యం పాత్రలో హీరో భావోద్వేగ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ప్రతీ సీన్ లో ఊరి వాతావరం, ఆచారాలు, భావోద్వేగ సన్నివేశాలను చక్కగా చూపించారు. 

సినిమా ప్లస్ పాయింట్స్ 

  • తెలంగాణ పల్లె ప్రకృతిని ప్రతిభించిచే విజువల్స్, 
  • రియల్ లొకేషన్స్ 
  • నటీనటుల పాత్రల్లో సహజత్వం 
  • భావోద్వేగ సన్నివేశాలు, డైలాగులు, ఎమోషనల్ రైటింగ్. 

ఇక  సినిమా మైనస్ ల విషయానికి వస్తే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఈమూవీలో ఐదు పాటలు ఉండగా.. బతుకమ్మ సాంగ్ హైలైట్ గా నిలిచింది.  'విరాట పర్వం' ఫేమ్ సురేష్ బొబ్బిలి  ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

telugu-news | latest-news | cinema-news 

Also Read: Cinema: నిన్న డ్రగ్స్... ఇవాళ లైంగిక ఆరోపణలు.. మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు