సినిమా నచ్చని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసినా.. ఆటిట్యూడ్ స్టార్ వీడియో వైరల్

నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.అందులో తన ఫస్ట్ మూవీ నచ్చని ఆడియన్స్ కు టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చానని, చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్నానని అన్నాడు. అయితే తన సినిమా నచ్చలేదని కొద్ది మంది మాత్రమే మెసేజ్ చేశారని చెప్పాడు.

New Update
chandrahaas

టీవీ సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఇటీవల 'రామ్‌ నగర్‌ బన్నీ' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అతి చేష్టలతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ గు గురయ్యాడు చంద్రహాస్. ఆ ట్రోలింగ్ ఒకవిధంగా అతనికి బాగానే కలిసొచ్చింది. ట్రోలింగ్ తోనే చంద్రహాస్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. అతనికి 'ఆటిట్యూడ్ స్టార్' అనే ట్యాగ్ కూడా దానివల్లే వచ్చింది. 

అయితే తన ఫస్ట్ మూవీ రిలీజ్ టైం లో ఆడియన్స్ కు చంద్రహాస్ ఓ ప్రామిస్ చేశాడు. 'రామ్‌ నగర్‌ బన్నీ' సినిమా మీకు నచ్చకపోతే నాకు సోషల్ మీడియాలో మెసేజ్ చేయండి. మీ టికెట్ డబ్బులు కచ్చితంగా మీకు గూగుల్ పే చేస్తానని అన్నాడు. కట్ చేస్తే.. ఆ సినిమా ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

కానీ సినిమాలో చంద్రహాస్ ఫైట్స్, డ్యాన్సులలో అదరగొట్టాడు. కుర్రాడిలో మంచి టాలెంట్ ఉందని అందరి చేత అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు 'బరాబర్‌ ప్రేమిస్తా' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్ర టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్.. మీ ఫస్ట్ సినిమా నచ్చకపోతే డబ్బులు రిటర్న్ చేస్తా అని ప్రామిస్ చేశారు కదా! ఎవరైనా సినిమా నచ్చలేదు మనీ పంపమని మెసేజ్ చేశారా? అని అడిగారు. 

మనీ రిటర్న్ చేశా..

దానికి మన ఆటిట్యూడ్ స్టార్ బదులిస్తూ..' జన్యున్ గా సినిమా చూసి నచ్చలేదని నాకు మెసేజ్ చేసిన వాళ్లందరికీ నేను మనీ రిటర్న్ చేశాను. కానీ అలా చాలా తక్కువ మంది మాత్రమే మెసేజ్ చేశారు. ఒక 20 నుంచి 30 మందికి మాత్రమే మనీ రిటర్న్ చేశా అంతే..' అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read : 'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు