/rtv/media/media_files/2025/08/20/arundhati-movie-child-artist-2025-08-20-10-42-37.jpg)
arundhati movie child artist
హీరోయిన్ అనుష్క ముఖ్య పాత్రలో నటించిన అరుంధతి సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క నటన అదిరిపోయింది. అయితే అనుష్క చిన్నప్పటి పాత్రలో జేజమ్మగా చైల్డ్ ఆర్టిస్ట్ దివ్వ నగేష్ నటించింది. ఈమె నటనకు అందరూ కూడా ఫిదా అయ్యారు. తన పాత్రలో లీనమై అద్భుతంగా నటించి నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే జేజమ్మ పాత్రలో ప్రేక్షకులను అలరించిన దివ్వ నగేష్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియుడితో ఘనంగా ఆగస్టు 18వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని దివ్య కానీ తన భర్త కూడా షేర్ చేయలేదు. అయితే సంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Rajinikanth - Kamal Haasan: భారీ మల్టీస్టారర్ లైన్లో పెట్టిన లోకేష్ కానగరాజ్.. 46 ఏళ్ళ తర్వాత రజిని - కమల్ కాంబో..
ఐదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న చైల్డ్ ఆర్టిస్ట్..
దివ్వ నగేష్ తన సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్‌తో ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉంది. ఈ ఏడాది జనవరిలో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 18వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు వీరి ఫొటోషూట్ ఫొటోలను కూడా దివ్వ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దివ్వ నగేష్ అరుంధతి తర్వాత సింగం పులి, అపరిచితుడు వంటి సినిమాల్లో నటించింది. అలాగే నాన్న నేను ఓ అబద్ధం అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. కాకాపోతే ఈ సినిమా పెద్ద సక్సెస్‌ను అందుకోలేకపోయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా దివ్వ నటించింది. అయితే తమిళ సినిమాతో బాలనటిగా దివ్వ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ తెలుగులో అరుంధతి సినిమాతోనే గుర్తింపు లభించింది. ఇప్పటికీ చాలా మందికి ఈమె రియల్ నేమ్ కంటే జేజమ్మ అనే గుర్తు ఉంటుంది.
ఇది కూడా చూడండి: Hari Hara Veera Mallu OTT: ఓటీటీలో 'హరిహర వీరమల్లు' కొత్త క్లైమాక్స్.. ఎలా ఉందంటే..?