Rajinikanth - Kamal Haasan: భారీ మల్టీస్టారర్ లైన్లో పెట్టిన లోకేష్ కానగరాజ్.. 46 ఏళ్ళ తర్వాత రజిని - కమల్ కాంబో..

'కూలీ’ హిట్‌తో ఫుల్ జోష్ లో ఉన్న లోకేష్ కనకరాజ్, ఇప్పుడు రజినీ, కమల్ లతో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కమల్ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది.

New Update
Rajinikanth Kamal Haasan

Rajinikanth Kamal Haasan

Rajinikanth - Kamal Haasan: తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న స్టార్ డైరెక్టర్ పేరు లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj).. ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి కూలీ(Coolie Movie) సినిమాని తెరకెక్కించాడు.. రీసెంట్ గా రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయినా 3 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లో చేసి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కూలీ సక్సెస్ తో లోకేష్ కానగరాజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా రజినీకాంత్, కమల్ హాసన్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. 466 ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరు సూపర్ స్టార్‌లు ఒకే తెరపై కనిపించబోతున్నారని ఊహిస్తేనే ఆ మజా మాములుగా ఉండదు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా లోకేష్, కమల్ హాసన్‌ను కలిసి ఓ కథ వినిపించాడని, కమల్ ఆ కథకు అంగీకారం తెలిపారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ రూపొందించిన ‘కూలీ’ భారీ విజయంతో ఇప్పుడు ఆయన చేయబోయే మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు భారీగా ఉండనున్నాయి.

Also Read: ఓపెనింగ్ వీకెండ్ దుమ్మురేపిన 'కూలీ'.. 200 కోట్ల క్లబ్​లోకి ఎంట్రీ!

‘ఖైదీ 2’ ప్రస్తుతం పెండింగ్..?

ఇకపోతే లోకేష్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అయిన ఖైదీ కి సీక్వెల్ గా వస్తున్న ‘ఖైదీ 2’ ప్రస్తుతం పెండింగ్ లో పడినట్లు తెలుస్తోంది.. ఖైదీ సినిమాలో కార్తీ నటన, కథనం, థ్రిల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, లోకేష్ ముందుగా రజినీ - కమల్ ప్రాజెక్ట్ పూర్తి చేసి, ఆ తర్వాత  ‘ఖైదీ 2’పై పని చేయనున్నాడట.

ఖైదీ 2 గురించి నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. "ఖైదీ 2 స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది. కార్తీ ప్రస్తుతం తమిళ్‌ దర్శకుడుతో సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఖైదీ 2లోకి ఎంటర్ అవుతాడు. 

ఖైదీ మూవీ గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మొదటి ఖైదీ సినిమా అంతా ఒక్క రాత్రిలో జరిగే కథ. ఇందులో ఎలాంటి హీరోయిన్ పాత్రలు లేవు. పూర్తి స్థాయిలో యాక్షన్, థ్రిల్, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా, బ్రూస్ విల్లిస్ నటించిన ‘డై హార్డ్’ సినిమాను ప్రేరణగా తీసుకుని రూపొందించబడినట్టు లోకేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇక  ఓవైపు రజినీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్(Rajinikanth - Kamal Haasan Multi Starrer), మరోవైపు ఖైదీ 2 వంటి భారీ ప్రాజెక్టులతో లోకేష్ కనకరాజ్ తమిళ ఇండస్ట్రీ నుండి దూసుకెళ్తున్నారు. ఇక ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు