Hari Hara Veera Mallu OTT: ఓటీటీలో 'హరిహర వీరమల్లు' కొత్త క్లైమాక్స్.. ఎలా ఉందంటే..?

పవన్ కళ్యాణ్ నటించిన "హరి హర వీర మల్లు" ఇప్పుడు ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. థియేటర్ వెర్షన్‌తో పోల్చితే, ఓటీటీలో 15 నిమిషాలు తక్కువ రన్ టైమ్ తో, క్లైమాక్స్ మార్పులతో విడుదలైంది. వీఎఫ్ఎక్స్ సీన్లు మెరుగుపరిచి కొత్త క్లైమాక్స్ తో ఓటీటీలోకి రావడం విశేషం.

New Update
Hari Hara Veera Mallu OTT

Hari Hara Veera Mallu OTT

Hari Hara Veera Mallu OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన మొదటి పాన్-ఇండియా సినిమా "హరి హర వీర మల్లు: పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా, థియేటర్ రిలీజ్‌కి కేవలం నాలుగు వారాలకే ఓటిటీలోకి రావడం విశేషం.

ఈ చిత్రం మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలై, ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ చేతిలోకి వెళ్ళింది. థియేటర్లలో విడుదలైన తర్వాత విమర్శకులు, ప్రేక్షకులు నుండి మిక్స్డ్ టాక్ దగ్గించుకోవడంతో, సినిమాపై వచ్చిన ట్రోల్ల్స్ ని దృష్టిలో పెట్టుకుని టెక్నికల్ పరంగా కొన్ని మార్పులు చేసి ఓటిటీలో విడుదల చేశారు.

ఓటిటీలో కొత్త క్లైమాక్స్..

ఓటిటీలో వస్తున్న వెర్షన్‌లో చాలా మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా, హార్స్ రైడింగ్ సీన్స్, పవన్ కళ్యాణ్ విల్లు పట్టిన సీన్స్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే వీఎఫ్ఎక్స్ పై విమర్శలు రావడంతో వాటిని కాస్త మెరుగుపరిచారు. కొన్ని భాగాలను పూర్తిగా తీసేసారు కూడా.

ముఖ్యంగా, థియేటర్లో చివర్లో బాబీ డొల్ "ఆంది వచ్చేసింది" అని చెప్పే సీన్ తో పాటు, ఆయనతో పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే తుపాను ఫైట్ సీన్‌ను పూర్తిగా తీసేసారు. ఇప్పుడు ఓటిటీలో ఆ సీన్ ఉండదు. "అసుర హననం" పాట తర్వాత సినిమా పార్ట్ 2 ప్రకటనతో ముగుస్తుంది.

ఈ మార్పులతో, ఓటిటీలో సినిమా దాదాపు 15 నిమిషాలు తక్కువ నిడివితో అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా, సినిమా నిడివి 2 గంటలు 33 నిమిషాలు మాత్రమే. సినిమాను మొదటి రోజు థియేటర్లో చూసినవారు, ఓటిటీలో చూస్తే తేడాలను ఈజీగా కనిపెట్టొచ్చు.

Also Read: ‘HHVM’ నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం అదే.. మొత్తం చెప్పేసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ

ఇప్పటికే హరి హర వీర మల్లుకు మూడు వేరు వేరు క్లైమాక్స్ లు రూపొందించారన్నది ఇండస్ట్రీ టాక్. ఓటిటీలో ఇప్పుడు చూపిస్తున్న వెర్షన్, పూర్తిగా హోం ఆడియన్స్‌కి అనువుగా ఉండేలా ఎడిట్ చేసినదిగా తెలుస్తోంది. అయితే ఈ వెర్షన్ ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.

Also Read: చిరంజీవి పుట్టిన రోజున పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే - పోస్ట్ వైరల్

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్, సునీల్, రఘు బాబు, వెన్నెల కిశోర్, కబీర్ దుహాన్ సింగ్, సచిన్ ఖేడేకర్, కోట శ్రీనివాసరావు (ఇది ఆయన చివరి సినిమా) నటించారు. సినిమాను ఏఎం రత్నం సమర్పించగా, ఏ. దయాకర్ రావు నిర్మించారు. సంగీతాన్ని ఎం ఎం కీరవాణి అందించారు.

మరి కొత్త క్లైమాక్స్ తో  ఓటిటీలోకి వచ్చిన 'హరి హర వీర మల్లు' ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. మీరు కూడా  'హరి హర వీర మల్లు' కొత్త వెర్షన్ ని  ఓటిటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

Advertisment
తాజా కథనాలు