Ar Rahman New Car: ఏఆర్ రెహమాన్ కొత్త కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మహీంద్రా XUV 9e ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశారు. ఈ ఈవీ కారులో డాల్బీ ఆట్మస్ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే విడాకుల తర్వాత ఆయన ఈ ఖరీదైన కారు కొనడం ఆసక్తికరంగా మారింది.

New Update
Ar Rahman New Car

Ar Rahman New Car

Ar Rahman New Car: ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా బాగా నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బట్టి ప్రముఖ వాహన కంపెనీలు కూడా ఈవీల పై మొగ్గు చూపుతున్నాయి. జనాలు కూడా పెట్రోల్ కార్లు వాడతూనే, చాలా మంది ఈవీ మోడళ్లపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరిపోయారు.

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

తెలుగు, తమిళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో సంగీతాన్ని అందించిన రెహమాన్, ప్రస్తుతం తెలుగు సినిమా ‘పెద్ది’ కోసం పని చేస్తున్నారు. అయితే, ఇటీవల రెహమాన్ తన కలెక్షన్ లోకి కొత్తగా మహీంద్రా కంపెనీకి చెందిన XUV 9e ఎలక్ట్రిక్ కారును చేర్చుకున్నారు.

ఈ విషయాన్ని రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే, ఈ కార్‌ ధర సుమారుగా రూ.25 నుండి రూ.35 లక్షల మధ్యగా ఉండే అవకాశం ఉంది.

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

అయితే ఈ కొనుగోలుకు వెనుక మరొక ఆసక్తికరమైన విషయముంది. బీఎస్6 మోడల్ కార్లలో సౌండ్ సిస్టమ్ కోసం రెహమాన్ పని చేశారు. ఇక ఇప్పుడు ఆయన కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కార్‌లో ప్రత్యేకంగా డాల్బీ ఆట్మస్ సౌండ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయించారని, స్వయంగా రెహమానే వెల్లడించారు.

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!

అయితే విడాకులు తర్వాత రెహమాన్ ఈ కొత్త కాస్టలీ కార్ కొనడం విశేషం. సైరా భానుతో దాదాపు 29 ఏళ్లపాటు వివాహబంధంలో ఉన్నారు. కొంతకాలం క్రితమే వారు విడిపోవడం జరిగింది. అయితే, విడాకుల వెనుక కారణాలు మాత్రం వారు బయటపెట్టలేదు.

Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు