HIT 3 ఏపీలో 'హిట్ 3' టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్

నాని 'హిట్ 3' టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ లో రూ.50, మల్టీ ప్లెక్స్ లో రూ. 75 పెంచుకునేలా ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదల తేదీ నుంచి 7 రోజుల పాటు ఈ ధరలు అమలు ఉంటాయని తెలిపింది.

New Update

HIT 3 Ticket Price సూపర్ హిట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'హిట్' ఫ్రాంచైజీలో భాగంగా రాబోతున్న లేటెస్ట్ మూవీ 'హిట్ 3'. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం మే1న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ రూ. 50 పెంచగా.. మల్టీ ప్లెక్స్ లలో రూ. 75 విత్ GST పెంచుకునేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ ధరలు విడుదలైన తేదీ నుంచి 7 రోజుల పాటు మాత్రమే కొనసాగుతాయని తెలిపింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు అవకాశం లేకపోయింది. 

భారీ అంచనాలు.. 

ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. నాని కూడా ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా.. టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రంలో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు సింపుల్ గా, ఫ్యామిలీ అబ్బాయిలా కనిపించిన నానిని.. ఇందులో ఒక వైలెంట్ క్యారెక్టర్ లో చూడబోతున్నట్లు తెలుస్తోంది. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ప్యారడైస్

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత 'ప్యారడైస్' అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నారు నాని. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి చిన్న గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేయగా.. అందులో నాని లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేసింది. 

cinema-news | latest-news

Also Read: Naga chaithanya తండ్రి కాబోతున్న నాగచైతన్య.. ఆనందంలో అక్కినేని కుటుంబం..?

Advertisment
Advertisment
తాజా కథనాలు