/rtv/media/media_files/2025/04/30/OSYQfip9WJECwcpQHDwz.jpg)
naga chaithanya - sobhita pregnancy rumors
Naga chaithanya- Sobhita అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే భార్య శోభితతో కలిసి యూరోప్ ట్రిప్ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ జంట. అంతేకాదు కాదు పెళ్లి తర్వాత నుంచి తమకు సంబంధించిన ప్రతీ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేస్తూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు.
శోభిత ప్రెగ్నెన్సీ రూమర్స్
ఈ క్రమంలో తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు నాగచైతన్య, శోభిత దీనిపై స్పందించలేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం నాగార్జున ఈ విషయంపై త్వరలో స్పష్టత ఇవ్వవచ్చని టాక్.
Marriage, Blockbuster movie, Now Baby 👌#news3people#NagaChaitanya#shobitha#baby#akkinenipic.twitter.com/cVZ5AbHB0N
— NEWS3PEOPLE (@news3people) April 28, 2025
2024లో పెళ్లి
అయితే అక్కినేని క్లోజ్ సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వినిపిస్తోంది. ఇవి కేవలం కొందరు పుట్టించిన పుకార్లు మాత్రమేనని తెలుస్తోంది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న శోభిత-చైతన్య 2024లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టైల్లో జరిగింది. పెళ్లి తర్వాత నాగచైతన్య తన కెరీర్ లో మొదటి 100 కోట్ల క్లబ్ చిత్రం 'తండేల్' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. శోభిత శోభిత మాత్రం పెళ్లి తర్వాత తన సినిమాల సంఖ్యను తగ్గించింది.
నాగచైతన్య సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 'Shoyu' క్లౌడ్ కిచెన్ ప్రారంభించిన చై.. తాజాగా Scuzo అనే మరో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. జాపనీస్ స్పెషల్స్ 'Shoyu' రెస్టారెంట్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
telugu-news | cinema-news | naga-chaithanya-sobhita | sobhita pregnency rumours