Anasuya Bharadwaj: చెప్తే నమ్మేలా ఉండాలి.. ట్రోలర్లకు అడ్డంగా దొరికేసిందిగా..!

టీవీ యాంకర్‌గా కరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం సినిమాలలో ఫుల్ బిజీగా మారింది. ఆమెను అసభ్యంగా ట్రోల్ చేస్తున్న 3 మిలియన్ల మందిని బ్లాక్‌ చేశానని ఓ ఇంటర్వ్యూ లో చప్పుకొచ్చింది అయితే నెటిజన్లు ఆమెను ఇప్పుడు ఈ విషయంపై కూడా మళ్ళీ ట్రోల్‌ చేస్తున్నారు.

New Update
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj: ప్రముఖ టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్‌ ఇప్పుడు వెండితెరపై తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ ను సంపాదించుకుంది. 'రంగస్థలం', 'పుష్ప', 'పుష్ప 2', 'ప్రేమవిమానం', 'రజాకార్‌' వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం తమిళ చిత్రాలు 'ఫ్లాష్‌బ్యాక్‌', 'వోల్ఫ్‌' లో నటిస్తోంది. సినిమాల ఆఫర్లు పెరగడంతో టీవీకి గుడ్‌బై చెప్పి ఫుల్‌టైమ్ మూవీ ఆర్టిస్టుగా మారింది.

Also Read:ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

అయితే సినిమాలతోపాటు అనసూయ సోషల్‌మీడియాలో కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండపై గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్‌ ఆమెను టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. 40 ఏళ్ల వయస్సులో కూడా తనకు ‘ఆంటీ’ అనే పిలుపు నచ్చదని అనసూయ చాల సందర్భాలలో చెబుతున్నా సరే, నెటిజన్లు మాత్రం అదే పదంతో ఆమెను రెచ్చగొడుతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌ గురించి స్పందించిన అనసూయ, “ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే నేను వారిని వెంటనే బ్లాక్‌ చేస్తాను. ఇప్పటివరకు సుమారు 3 మిలియన్ల మందిని బ్లాక్‌ చేశాను. ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా కొత్త ట్రోలింగ్స్ కు దారితీశాయి. “ఇన్‌స్టాగ్రామ్‌లో 16 లక్షల ఫాలోవర్లు ఉన్న అనసూయ 30 లక్షల మందిని ఎలా బ్లాక్‌ చేస్తుంది?” అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. కొందరు అనసూయ చెప్పేవన్నీ అవాస్తవాలు అంటూ ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు