Takshakudu: ‘తక్షకుడు’గా ఆనంద్ దేవరకొండ.. రిలీజ్ ప్లానింగ్ తెలిస్తే షాకే..!

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'తక్షకుడు' సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల కానుంది. “జింక పిల్లలే నేరస్థులా?” అనే డైలాగ్‌తో ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం వినోద్ దర్శకత్వంలో రూపొందుతోంది. విడుదల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

New Update
Takshakudu

Takshakudu

Takshakudu: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, కథాబలంతో కూడిన సినిమాలపై దృష్టి పెట్టిన ఆనంద్, ఈసారి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని సిద్ధమవుతున్నారు.

తక్షకుడు.. ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లో

ఆనంద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం పేరు ‘తక్షకుడు’. ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్లో విడుదల కానుంది. థియేటర్లకు బదులుగా,  నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం విశేషం.

Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!

“వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు..” 

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది. అందులో కనిపించే డైలాగ్ “వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు..” అనే పదాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో ఓ లోతైన సందేశం ఉందని, కథలో న్యాయం, అన్యాయం మధ్య పోరాటం నేపథ్యంలో ఈ లైన్ ఉండవచ్చని భావిస్తున్నారు.

Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!

ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్, టీజర్ లుక్స్ చూస్తే, ఇది సాధారణ యాక్షన్ సినిమా కాదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ఆనంద్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు, విడుదల తేదీ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్

ఇప్పటి తరం ప్రేక్షకులు ఓటీటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ఆనంద్ దేవరకొండ కూడా ఈ మారుతున్న ట్రెండ్‌ను గుర్తించి, మంచి కంటెంట్‌తో ముందుకు రావడంపై సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. "తక్షకుడు" సినిమాతో ఆయన మరొక మంచి చిత్రాన్ని అందిస్తారనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘తక్షకుడు’ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. "జింక పిల్లలే నేరస్థులా?" అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ కథ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో త్వరలోనే మనం నెట్‌ఫ్లిక్స్లో చూడొచ్చు.

Advertisment
తాజా కథనాలు