నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). దర్శకుడు మారి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు, ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నారు.
Anaganaga Okaroju Release Date
ఈ నేపథ్యంలో వారి వెయిటింగ్‌కు మేకర్స్ చెక్ పెట్టారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది మంచి ట్రెండ్ అవుతోంది.
anaganaga okaroju | naveen-polisetty | latest-telugu-news | telugu-news