Amitabh Bachchan: ఐశ్వర్య, అభిషేక్.. KBC నెక్స్ట్ హోస్ట్ పై అమితాబ్ క్లారిటీ

KBC నెక్స్ట్ హోస్టుగా ఐశ్వర్య లేదా అభిషేక్ వ్యవహరించనున్నారు అంటూ వస్తున్న రూమర్లకు అమితాబ్ చెక్ పెట్టారు. ఇటీవలే చివరి ఎపిసోడ్ సందర్భంగా బిగ్ బీ మాట్లాడుతూ.. వచ్చే సీజన్ లో మళ్ళీ కలుస్తాను అని చెప్పారు. దీంతో తాను షోను వీడడంలేదని అర్థమైంది.

New Update
kbc amitab

kbc amitab

Amitabh Bachchan:  ప్రముఖ గేమ్ షో  'కౌన్ బనేగా కరోడ్‌పతి' హోస్టింగ్ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తప్పుకుంటారని గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. గత 16 సీజన్లుగా KBCకి హోస్ట్ గా వ్యవహరించిన అమితాబ్.. షోను వీడుతున్నారని తెలియడంతో అభిమానుల గుండె పగిలింది.  ఆయన స్థానంలో తదుపరి సీజన్ హోస్టుగా ఐశ్వర్య లేదా అభిషేక్ వస్తారని ప్రచారం జరిగింది.  అయితే తాజాగా 16వ సీజన్ చివరి ఎపిసోడ్ సందర్భంగా షోలో మాట్లాడిన అమితాబ్ తన స్పీచ్ ద్వారా ఈ రూమర్లకు చెక్ పెట్టారు.

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

అమితాబ్ క్లారిటీ 

షో ప్రయాణాన్ని ప్రతిభింబిస్తూ అమితాబ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. "గత 16 సీజన్లుగా కౌన్ బనేగా కరోడ్ పతి విశేష ఆధరణ పొందింది. నేను హోస్టుగా వ్యవహరించిన ప్రతీసారి నాపై ఎంతో ప్రేమ, ఆధరణ, మద్దతు  చూపించారు. అలాగే నేను ఎల్లప్పుడూ మీ ప్రేమను స్వీకరిస్తూనే ఉంటాను. వచ్చే సీజన్ లో తిరిగి మిమల్ని కలుస్తాను అని అన్నారు''. దీంతో బిగ్ బీ హోస్టింగ్ నుంచి తప్పుకుంటున్నారు, నెక్స్ట్ సీజన్ ఐశ్వర్య లేదా అభిషేక్ హోస్ట్ చేయనున్నారు అంటూ వచ్చిన పుకార్లకు చెక్ పడింది. ఇండైరెక్ట్ గా అమితాబ్ తానే నెక్స్ట్ సీజన్ హోస్టుగా తిరిగి రావడాన్ని ధృవీకరించారు. 

ఇక అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ప్రభాస్ 'కల్కి' సినిమాలో అశ్వత్థామ పాత్రలో  మెస్మరైజ్ చేశారు. అలాగే ఇటీవలే రజినీకాంత్  'వేట్టయాన్' లో జస్టిస్ సత్యదేవ్ గా అలరించారు. ప్రస్తుతం అమితాబ్ బాలీవుడ్  'రామాయణ' ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.  

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు