Allu Arjun : జపాన్ లో అల్లు అర్జున్ సంచలనం.. ధూమ్ 3 రికార్డును బ్రేక్ చేసిన పుష్పరాజ్!

రెండు వారాల్లోనే పుష్ప 2: ది రూల్ సరికొత్త రికార్డులను సృష్టించి, జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలోకి అధికారికంగా ప్రవేశించింది.

New Update
pushpa

జపాన్ బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వైల్డ్ ఫైర్ అంటూ సత్తా చాటుతున్నారు. అక్కడ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పుష్ప 2: ది రూల్ సరికొత్త రికార్డులను సృష్టించి, జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలోకి అధికారికంగా ప్రవేశించింది.

జనవరి 16, 2026న జపాన్ థియేటర్లలో అడుగుపెట్టిన పుష్ప 2, కేవలం 14 రోజుల్లోనే సుమారు రూ. 6.03 కోట్ల వసూళ్లను సాధించింది. దీనితో 2014 నుండి పదో స్థానంలో ఉన్న అమీర్ ఖాన్ ధూమ్ 3 104.5 మిలియన్లు) రికార్డును పుష్ప బ్రేక్ చేసి, టాప్ 10 క్లబ్‌లో చేరింది.

టోక్యో, ఒసాకా వంటి ప్రధాన నగరాల్లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, సుకుమార్ టేకింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లకు జపనీస్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రారంభంలో వసూళ్లు కాస్త నిలకడగా ఉన్నప్పటికీ, మౌత్ టాక్ బాగుండటంతో కలెక్షన్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి..

జపాన్‌లో టాప్ 5 భారతీయ సినిమాలు ఇవే:


ప్రస్తుతం జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో RRR అగ్రస్థానంలో కొనసాగుతోంది.

  • RRR: 2.42 బిలియన్లు (రూ. 139 కోట్లు)
  • ముత్తు: 405 మిలియన్లు
  • బాహుబలి 2: 305 మిలియన్లు
  • 3 3 ఇడియట్స్: 170 మిలియన్లు
  • ఇంగ్లీష్ వింగ్లీష్: 160 మిలియన్లు

దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించగా, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో మెరిశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పరాజ్ ఎదిగిన తీరును ఈ పార్ట్ 2లో ఎంతో గ్రాండ్‌గా చూపించారు.

ఇక జపాన్‌లో భారతీయ సినిమాల హవా ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి 13న రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా కూడా అక్కడ విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు