/rtv/media/media_files/2025/02/18/bXQAiNe0OiRP3SS41BPV.jpg)
pushpa 2 final collections
Pushpa 2 Closing Collection: సుకుమార్- అల్లు అర్జున్(Sukumar- Allu Arjun) కాంబోలో భారీ అంచనాలతో విడుదలైన 'పుష్ప2' ఇండియన్ బాక్స్ ఆఫీస్(Indian Box Office) వద్ద సంచలనం సృష్టించింది. రికార్డు వసూళ్లతో ఇండియన్ ఇండస్ట్రీ హిట్టు(Industry Hit)గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇప్పటివరకూ ప్రభాస్ బాహుబలి(Prabhas Baahubali) పేరు మీదున్న రికార్డులను బద్దలుకొట్టింది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోనూ విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది.
Also Read: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?
రూ. 1,871 కోట్లు..
అయితే తాజాగా మేకర్స్ 'పుష్ప 2' ఇప్పటివరకూ సాధించిన ఫైనల్ కలెక్షన్స్(pushpa 2 final collections) ని వెల్లడించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 1,871 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్.. రికార్డ్స్ రప్పా రప్పా అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈమూవీలో.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, పవని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
Shattering many records and creating new records, #Pushpa2TheRule stands tall as INDIAN CINEMA'S INDUSTRY HIT ❤️🔥#Pushpa2TheRule grosses 1871 CRORES WORLDWIDE 💥💥
— Pushpa (@PushpaMovie) February 18, 2025
RECORDS RAPA RAPAA 🔥#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/zR6H9BQzrT
ఇది ఇలా ఉంటే పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టును ఆశ్రయించారు. కాగా, హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Also Read : Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!