Pushpa 2 : హిందీలో చరిత్ర సృష్టించిన పుష్ప రాజ్.. ఎన్ని కోట్లంటే..?

అల్లు అర్జున్ 'పుష్ప2' హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా 700 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది. బాలీవుడ్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. ఈ రికార్డును ఇప్పట్లో మరో సినిమా బ్రేక్ చేయడం అసాధ్యమని బాలీవుడ్ ట్రేడ్ అంచనా .

New Update

Pushpa 2:  భారతీయ చలన చిత్ర రంగంలోనే కనీవినీ ఎరుగని చరిత్రను సృష్టించింది పుష్ప - 2 సినిమా. ఈ సినిమా హిందీ వెర్షన్ తాజాగా 700 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వడం కాదు, 700 కోట్ల రూపాయల క్లబ్ ను క్రియేట్ చేసింది పుష్ప- 2. ఇన్నాళ్లూ సినిమాలన్నీ 500 కోట్ల క్లబ్ లోకి వెళ్లడమే గొప్పగా భావించాయి. బాహుబలి-2 మేకర్స్ ఇన్నాళ్లూ దీన్నే ఘనంగా చెప్పుకున్నారు. అలాంటిది పుష్ప-2 సినిమా బాహుబలి- 2ను క్రాస్ చేయడమే కాకుండా, ఎవ్వరికీ అందనంత ఎత్తులో 700 కోట్ల క్లబ్ ను జనరేట్ చేసింది.

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!

చరిత్ర సృష్టించిన పుష్ప 

బాలీవుడ్ ట్రేడ్ అంచనా ప్రకారం, ఈ రికార్డ్ ను ఇప్పట్లో మరో సినిమా బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే, ఈ సినిమా ఈ క్లబ్ వరకే పరిమితం అవుతుందని చెప్పలేం. ఉత్తరాదిన ఈ సినిమా మాస్ జనాల్లోకి ఎక్కేసింది. బాలీవుడ్ సెంటర్లలో రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. ఈ సినిమా ప్రభంజనం చూసి మిగతా హిందీ సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతున్నాయి. సో.. ఇదే ఊపులో ఈ సినిమా ఈ వారాంతానికి 800 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటోంది ట్రేడ్ చరిత్ర సృష్టించిన పుష్ప - 2

Also Read: Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు