పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ!

బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను చూడగానే ఏమనిపిస్తుంది? అని బాలయ్య అడగగా.. కల్యాణ్‌ గారి ధైర్యం అంటే ఇష్టం..చాలా డేరింగ్ పర్సన్‌ అంటూ బన్నీ బదులిచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

allu arjun  (2)

allu arjun

New Update

Allu Arjun:  ఏపీ ఎన్నికల్లో సమయంలో ఐకాన్ స్టార్ పవన్ అల్లు అర్జున్ శిల్పా రవికి సపోర్ట్ గా ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీలో చిచ్చు రేపింది. పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధ పార్టీకి మద్దతునివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం  జరుగుతోంది. 

Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?

పవన్ కళ్యాణ్ లో నాకు ఇష్టమైనది అదే.. 

అయితే ఇటీవలే బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్న అల్లు అర్జున్ మెగా, అల్లు వివాదం అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.  'అన్‌స్టాపబుల్' షోలో బాలయ్య పలు స్టార్ హీరోల ఫొటోలు చూపించి.. వారిని చూడగానే ఏమనిపిస్తుంది అని బన్నీని అడిగారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్  ఫోటో కూడా చూపించారు. ఈ ప్రశ్నకు బన్నీ.. పవన్ కళ్యాణ్ లో ఆయన దైర్యం అంటే నాకు ఇష్టం. చాలామంది లీడర్లను దగ్గర నుంచి చూశాను. కానీ.. లైవ్‌లో దగ్గరి నుంచి చూసిన డేరింగ్‌ పర్సన్‌ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలతో వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేనట్లు అర్థమవుతుంది. 

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మరో 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. 

 

Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

#balakrishna #allu-arjun #pawankalyan #unstoppable-with-nbk #Unstoppable Season 4
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe