AA22xA6: అల్లు అర్జున్ - అట్లీ BTS ఫోటోలు వైరల్.. లుక్ మామూలుగా లేదుగా!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తోన్న భారీ సినిమా AA22xA6 షూటింగ్ ముంబయి షెడ్యూల్ పూర్తయింది. జపాన్-బ్రిటీష్ డాన్సర్ హోకుటో కోనిషి పని చేసిన ఓ పాటకు సంబందించిన బీహైండ్ ద సీన్స్ ఫోటోలు షేర్ చేశాడు. ఇందులో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది.

New Update
AA22xA6

AA22xA6

AA22xA6: అల్లు అర్జున్(Allu Arjun) నెక్స్ట్ సినిమా AA22xA6 పేరిట తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాకి ప్రముఖ దర్శకుడు అట్లీ(Director Atlee) దర్శకత్వం వహిస్తున్నారు. బడా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలే ఈ సినిమా ముంబయిలో ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. తరువాత చిత్ర బృందం నెక్స్ట్ షెడ్యూల్ కోసం అబూదాబీకి వెళ్లి కొత్త లొకేషన్లను వెతుకుతోంది. షూటింగ్ వచ్చే నెలలో తిరిగి ప్రారంభం కానుంది.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం పనిచేసిన జపాన్-బ్రిటీష్ డాన్సర్, కొరియోగ్రాఫర్ హోకుటో కోనిషి ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా బీహైండ్ ద సీన్స్ (BTS) ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలలో అల్లు అర్జున్, అట్లీతో కలిసి ఉన్న హోకుటో, ఈ ప్రాజెక్టులో పనిచేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ పాటలో అల్లు అర్జున్ డాన్స్ చేసినట్లు సమాచారం, దీంతో పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్

ఈ చిత్రాన్ని Sun Pictures నిర్మిస్తుండగా, సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. నటీనటులు,  సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.

మొత్తానికి, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో భారీ క్రేజ్‌ఉంది. హోకుటో షేర్ చేసిన BTS ఫోటోలు ఈ హైప్‌ను మరింత పెంచుతోంది.

Advertisment
తాజా కథనాలు