బాలయ్య బాబు ‘అఖండ 2’ రిలీజ్ డేట్ అనౌన్స్.. ప్రోమో అదిరింది

బాలయ్య బాబు నటిస్తోన్న కొత్త సినిమా ‘అఖండ 2’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది 25 సెప్టెంబర్ 2025న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

New Update
balayya

బాలయ్య బాబు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఏడాదికి ఒకటి చొప్పున సినిమా తీసి ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ముఖ్యంగా ఈ ఏడాది ఏపీ ఎలక్షన్లపై ఫోకస్ పెట్టడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 

Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

వరుస పెట్టి సినిమాలను లైన్‌లో పెట్టాడు. బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇది వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో బాలయ్య లుక్ అదిరిపోయింది. 

Also Read :  'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!

అంతేకాకుండా బాలయ్య డైలాగ్స్ సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. రిలీజ్ అయిన ఆ టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ సైతం వచ్చింది. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బాలయ్య ‘అఖండ 2’ కూడా మొదలు పెట్టేశాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు

అఖండ 2 రిలీజ్ డేట్ అనౌన్స్

అప్పటి వరకు ఎలాంటి హిట్లు లేక సతమతమవుతున్న బాలయ్యకు ‘అఖండ’ మూవీ ఆకలి తీర్చింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ‘అఖండ 2’ మూవీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు కీలక అప్డేట్ వదిలారు. 

Also Read :  మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!

ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. వచ్చే ఏడాది దసరా కానుకంగా సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ ప్రోమో సైతం రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య కూతురు తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ అచంట - గోపీ అచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై బారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు