Good Bad Ugly OTT: ఓటీటీలోకి అడుగుపెడుతున్న అజిత్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ - 'గుడ్ బ్యాడ్ అగ్లీ'

అజిత్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ Netflix ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మే 8, 2025 నుండి స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ మూవీ తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

New Update
Good Bad Ugly OTT

Good Bad Ugly OTT

Good Bad Ugly OTT: తమిళ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా  ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అజిత్ కుమార్(Ajith Kumar), త్రిషా కృష్ణన్(Trisha) జంటగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇటీవలే ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. థియేటర్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ మే 8, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

Also Read: 70 ఏళ్ల అమ్మమ్మ చీరలో ముస్తాబైన హీరోయిన్.. ఎంత అందంగా ఉందో! ఫొటోలు చూస్తే అంతే

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌.. 

గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ Netflix ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మే 8, 2025 నుండి చూడొచ్చు. ఈ మూవీ తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ విషయానికి వస్తే..

ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే “AK” అనే రిటైర్డ్ గ్యాంగ్‌స్టర్ (అజిత్ కుమార్ పాత్ర) చుట్టూ తిరుగుతుంది. అనుకోని కారణాల వల్ల  పోలీసులకు లొంగి సాధారణ జీవితం గడపాలని AK నిర్ణయించుకుంటాడు. తన భార్య రమ్యా (త్రిషా) కుమారుడు విహాన్‌తో కలసి జీవితం కొనసాగించేందుకు 2007లో జైలుకు వెళ్లిన అతను 18 సంవత్సరాల తర్వాత విడుదలవుతాడు కానీ… గడచిన జీవితంలోని కొన్ని సంఘటనలు అతన్ని విడిచిపెట్టవు. పాత శత్రువులు, హంతకులు అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ గ్యాంగ్‌స్టర్ అవతారంలోకి దిగే AK తన కుటుంబాన్ని ఎలా రక్షించాడనేది ఈ మూవీ స్టోరీ.

ఈ మూవీలో అజిత్ కుమార్ "AK" అనే పాత్రలో అద్భుతమైన నటన  ప్రదర్శించారు,  త్రిషా కృష్ణన్ "రమ్యా"గా ఎంతో ఎమోషనల్ గా నటించి మెప్పించారు. అర్జున్ దాస్, జాకీ శ్రాఫ్, ప్రభు, ప్రసన్న, సునీల్, యోగి బాబు వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, సురేష్ చంద్ర, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా కలిసి నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీకి  అబినధన్ రామానుజం వర్క్ చేశారు. అలాగే, విజయ్ వెలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

మాస్‌కి పండగే

ఈ మూవీ మాస్ యాక్షన్ డ్రామాగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టింది. అజిత్ మాస్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. IMDb ఈ చిత్రానికి 7.1/10 రేటింగ్ ఇచ్చింది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లను ఇష్టపడేవారికి పండగే. థియేటర్‌లో మిస్ అయినవారు మే 8న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను మిస్ కావద్దు! ఇలాంటి మరిన్ని తాజా సినిమా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి. 

 Also Read:  Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

cinema: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు

టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నప్ప హార్డ్ డ్రైవ్ దొంగతనం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరూ కొట్టుకుంటున్నారు. ఆ హార్డ్ డ్రైవ్ మనోజ్ ఇంట్లో పని చేసే రఘు, చరిత అనే వాళ్ళే కొట్టేశారని మంచు విష్ణు ఆరోపిస్తున్నారు. 

New Update
manchu vishnu about Prabhas

manchu vishnu about Prabhas

కన్నప్ప సినిమా విడుదలకు ముందే సమస్యల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించి హార్డ్ డ్రైవ్ దొంగతనం అవడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.  ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్‌లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి పంపిన హార్డ్ డ్రైవ్ ఆఫీస్ బాయ్ రఘు ద్వారా చరిత అనే యువతికి అప్పగించారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ రెడ్డి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ముదురుతున్న అన్నదమ్ముల గొడవ..

దీనిపై తాజాగా మంచు విష్ణు కూడా స్పందించారు. హార్డ్ డ్రైవ్ దొంగతనం వెనుక తన సోదరుడు మంచు మనోజ్ హస్తం ఉందని ఆరోపించారు. రఘు, మనోజ్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడని, చరిత కూడా మనోజ్ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి అని అన్నారు.  45 రోజుల క్రితం హైవ్ స్టూడియోస్ నుంచి వచ్చిన హార్డ్ డ్రైవ్ పార్శిల్‌ను విష్ణు ఇంటి సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ సిబ్బంది అడ్డుకున్నారని..ఇప్పుడు కూడా ఇది వాళ్ళ నే అని మంచు విష్ణు అన్నారు. ఇప్పటికే చాలా వివాదాలతో మంచు కుటుంబం రోడ్డు మీదకు వచ్చింది. ఇప్పడు హార్డ్ డ్రైవ్ గొడవతో ఈ గొడవలు మరింత ముదిరిందని అంటున్నారు. 

మరోవైపు మనోజ్ భైరవం ఫంక్షన్ లో మనోజ్ కూడా హార్డ్ డ్రైవ్ గురించి మాట్లాడడం సంచలనం సృష్టించింది.  చరితకు మనోజ్ థాంక్స్ చెప్పారు. ఆమె చాలా గొప్ప ని చేసిందని..జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పారు. తన అన్నకు చరిత చేసిన మేలు మరువరానిది అంటూ మాట్లాడారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఆమె గురించే మాట్లాడడంతో మొత్తం హార్డ్ డ్రైవ్ వ్యవహారం అంతా ఆమె చుట్టూతానే తిరుగుతోంది అని తెలుస్తోంది. ఆమెను మధ్యలో పెట్టుకుని అన్నదమ్ముల గొడవ మరింత పెరిగేలా కనిపిస్తోంది. 

 

Also Read: Student Visas: వీసా స్లాట్లను రోజూ చెక్ చేసుకోండి..విద్యార్థులకు అమెరికా సూచన

Advertisment
Advertisment