/rtv/media/media_files/2025/01/09/7dBnkRl85B3OirJR5gHK.jpg)
adivi sesh mrunal thakur wamiqa gabbi
టాలీవుడ్లో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోలలో అడవి శేష్ ఒకరు. ఎప్పుడూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరోగా తనకంటూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు.
ఇక 'మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో కథలు ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డెకాయిట్, గూఢచారి-2 చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లలో హీరోయిన్ల మార్పు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Ready!
— Adivi Sesh (@AdiviSesh) December 17, 2024
KARNA HAI TOH KARNA HAI..
FAADNA HAI TOH FAADNA HAI 💥
Fix! #DACOIT robs theaters with @mrunal0801 pic.twitter.com/k854UMJ2Pu
Also Read : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!
‘డెకాయిట్’ మూవీలో మొదట అడవి శేష్ సరసన శ్రుతి హాసన్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. రెండు షెడ్యూల్‌లు పూర్తైన తరువాత శ్రుతి స్థానంలో మృణాల్ ఠాకూర్‌ని తీసుకున్నారు. శృతి హాసన్ తో శేష్ కు సరిగ్గా బాండింగ్ కుదరకపోవడం మూలానే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ చేశారని టాక్ నడిచింది. మధ్య బాండింగ్ సరిగా కలగలేకపోవడం అన్నది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
నిజానికి శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ను ఏదో మొహమాటానికి ఒప్పుకుందని ఆ కారణంతోనే తప్పుకున్నారని కూడా వార్తలు వినిపించాయి. ఈ ఒక్క సినిమానే అడివి శేష్ ‘గూఢచారి-2’ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ చిత్రానికి తొలుత బంటియా సంధూను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, ఆమె స్థానంలో వామికా గబ్బిని తీసుకున్నారు.
My partner in c̶r̶i̶m̶e̶ adventure 💥💥
— Adivi Sesh (@AdiviSesh) January 7, 2025
Welcome to the mission, #WamiqaGabbi
It's gonna be amazing to run with you in Europe!
THUNDER GLIMPSE loading this Month🔥#G2 #Goodachari2 pic.twitter.com/Hn01fiUB9v
Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి
నిన్నే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వామికాతో ఇటీవల యూరప్ షెడ్యూల్‌ని సైతం పూర్తి చేశారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లలోనూ హీరోయిన్ల మార్పు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఒకే హీరో సినిమాల్లో పదేపదే హీరోయిన్ల మార్పు ఎందుకు జరుగుతుంది? దీనికి క్రియేటివ్ డిఫెరెన్సులు కారణమా? లేక అడివి శేష్ తో హీరోయిన్స్ కి సింక్ అవ్వట్లేదా? లేకుంటే శేష్ తో వాళ్లకు ఇష్యుస్ ఉన్నాయా? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.