Rakul Preet : ప్రభాస్ సినిమా.. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత తీసేశారు

రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రభాస్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత చెప్పకుండానే ఆ సినిమా నుంచి తొలగించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

author-image
By Anil Kumar
rakul prabhas
New Update

Actress Rakul Preet Singh :

టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ప్రెజెంట్ జెనరేషన్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan), మహేష్ బాబు లాంటి స్టార్స్ తో జత కట్టిన ఈ బ్యూటీ.. ఒక్క ప్రభాస్ తో మాత్రం నటించలేదు. దీంతో వీళ్ళ కాంబో సెట్ కాలేదేమో అని ఆడియన్స్ అనుకోని లైట్ తీసుకున్నారు.

కానీ అసలు నిజం ఏంటంటే.. రకుల్ ప్రీత్ కు డార్లింగ్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. కానీ తనకు చెప్పకుండానే ఆ సినిమా నుంచి తొలగించారట. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి మాట్లాడింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

ఈ మేరకు ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.." నాకు ప్రభాస్‌తో మొదటిసారి నటించే అవకాశమొచ్చింది.. కానీ నాలుగు రోజుల పాటు షూటింగ్‌ అయ్యాక చెప్పకుండానే మరొకరితో రీప్లేస్ చేశారు. నా షెడ్యూల్‌ను ముగించిన తర్వాత ఢిల్లీకి వెళ్లాను.. ఆ తర్వాతే సినిమా నుంచి నన్ను తొలగించినట్లు తెలిసింది. ఈ విషయంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. అదొక్కటే కాదు మరో తెలుగు ప్రాజెక్ట్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది.

కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే తొలగించారు. ఆ తర్వాతే నాకు ఇండస్ట్రీపై కాస్తా అవగాహన పెరిగింది. ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలియనప్పుడు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దు" అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రభాస్ సినిమాలో తనను తీసేశారని చెప్పిన రకుల్.. అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేదు. ఇక ఇటీవల ఇండియన్‌-2 చిత్రంలో మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్‌.. ప్రస్తుతం బాలీవుడ్ లో దే దే ప్యార్ దే -2 ,మేరీ పత్నికా'లాంటి వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

Also Read :  బ్యాడ్‌ న్యూస్‌..రెండు రోజుల పాటు వైన్‌ షాపులు..!

#prabhas #actress-rakulpreet-singh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe