/rtv/media/media_files/2024/10/19/Ojk82L5RF2Qvu8GjO18m.jpg)
టాలీవుడ్లో అతికొద్ది సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ముద్దుగుమ్మ నేహా శెట్టి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకి మంచి క్రేజ్ ఉంది.
/rtv/media/media_files/2024/10/19/JHrHBk7dJThOCBlwqSmO.jpg)
ఎన్నో సినిమాలు చేసిన ఈ భామకి డీజే టిల్లు మంచి స్టార్డమ్ అందించింది. ఈ సినిమాతో నేహా బ్యూటీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
/rtv/media/media_files/2024/10/19/udpAvHRyHoaLwQE9DUCs.jpg)
ఎక్కువగా యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాలో నేహా తన అందచందాలతో కుర్రకారుని మంత్రముగ్ధులను చేసింది.
/rtv/media/media_files/2024/10/19/1QYCjxMsEl0hOeCPFlSx.jpg)
ఈ మూవీలో గ్లామర్ పరంగా కూడా మరింత ఫేమస్ అయింది. దోంతో ఈ భామకి వరుస అవకాశాలు వచ్చాయి.
/rtv/media/media_files/2024/10/19/rwKyKqtzusXs8hYFbobd.jpg)
నటుడు కార్తికేయతో ‘బెదురులంక’ సినిమాలో నటించింది. అయితే ఈ మూవీ పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
/rtv/media/media_files/2024/10/19/hn8ORgnihsIsMkyfbvZX.jpg)
అనంతరం ‘టిల్లు స్క్వేర్’ మూవీతో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆపై విశ్వక్ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ చేసింది.
/rtv/media/media_files/2024/10/19/ZVx1J4rE8TUE7hw4RY7R.jpg)
ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు తన హాట్ హాట్ అందాలతో అదరగొట్టేస్తుంది. ఎప్పటికప్పుడు న్యూ లుక్ ఫొటోలను షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ అందుకుంటుంది.
/rtv/media/media_files/2024/10/19/wWU4VcWFvRoGb5jQHcIe.jpg)
తాజాగా మరికొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి.