Actress Kasthuri: ముందస్తు బెయిల్ కోసం నటి కస్తూరి కోర్టును ఆశ్రయించారు. మధురై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణ చేపట్టనుంది. బహిరంగ క్షమాపణలు చెప్పిన తనపై ఉద్దేశపూర్వకంగా కేసులు వేశారని పిటిషన్ లో కస్తూరి పిటిషన్ లో పేర్కొన్నారు. గత రెండ్రోజులుగా ఆమె పరారీలో ఉన్నారు. ఆమె ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో కస్తూరి చిక్కుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సమాజం... చెన్నై, మధురై సహా పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదు చేశారు.
Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
పరారీలో నటి కస్తూరి..
నటి కస్తూరి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు నటి కస్తూరికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా ఇల్లు తాళం వేసింది. అలాగే ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకుంది. దీంతో కస్తూరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసంగంలో కస్తూరి మాట్లాడుతూ.. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని.. అలా వచ్చిన వారు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ కామెంట్ చేసింది.
Also Read: Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
ఇది ఇలా ఉంటే నటి కస్తూరి ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. "కొందరి వ్యక్తుల గురించి మాత్రమే నేను మాట్లాడానని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు. 'నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని. తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు ప్రేమ, కీర్తిని అందించారు. నా తెలుగు కుటుంబాన్ని అవమానించడం నా ఉద్దేశం కాదు.. అనుకోని సంఘటనకు నన్ను క్షమించండి" అంటూ కస్తూరి చెప్పింది. కస్తూరి బుల్లితెర పై 'గృహలక్ష్మి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.