Actress Divya Bharathi: వాళ్లు విడాకులు తీసుకుంటే నన్నేందుకు లాగుతున్నారు : దివ్యభారతి

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ భార్యతో విడిపోవడానికి నటి దివ్యభారతి కారణమంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నటి దివ్యభారతి దీనిపై స్పందించారు. జీవీ ప్రకాష్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

New Update

Actress Divya Bharathi: మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ 2024లో తన భార్య సైంధవితో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే చైన్నై ఫ్యామిలీ కోర్టులో అధికారికంగా పిటీషన్ కూడా దాఖలు చేశారు. అయితే వీరిద్దరూ విడిపోవడం రకరకాల ఊహాగానాలకు దారితీసింది. జీవీ ప్రకాష్ భార్య  సైంధవి విడిపోవడానికి నటి దివ్య భారతితో ప్రేమాయణం అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే జీవి ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో ఈ పుకార్ల స్పందిస్తూ.. వాటిలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. తన భార్య నుంచి విడిపోవడానికి దివ్య భారతి కారణం కాదని వివరించారు. అయినప్పటికీ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడలేదు. 

నటి దివ్య భారతి పోస్ట్ 

ఈ క్రమంలో తాజాగా నటి దివ్య భారతి.. జీవీ ప్రకాష్ తో డేటింగ్ రూమర్ల పై స్పందిస్తూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. వారి విడాకులతో తనకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా బదులిచ్చింది.  ''నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిగత కుటుంబ విషయాల్లోకి నా పేరును లాగుతున్నారు. జీవీ ప్రకాష్ ఫ్యామిలీ సమస్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. స్పష్టంగా చెప్పాలంటే.. నేను ఎప్పుడూ ఏ నటుడితో డేటింగ్ చేయలేదు, అండ్ వివాహితుడితో అస్సలు చేయను. నిరాధారమైన పుకార్లతో నా దృష్టిని ఆకర్షించలేరు. ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను.. కానీ గీత దాటింది. నిరాధారమైన ఆరోపణలతో నా ప్రతిష్ట చెడిపోవడనికి నేను ఒప్పుకోను. నేను ఒక ఇండిపెండెంట్, స్ట్రాంగ్ విమెన్. ప్రతికూలతను వ్యాప్తి చేయడానికి బదులుగా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడంపై దృష్టి పెడదాం. ఈ విషయంపై ఇది నా మొదటి,  చివరి ప్రకటన'' అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. 

Divyabharathi post
Divyabharathi post

నటి దివ్య భారతి- జీవీ ప్రకాష్ ఇటీవలే విడుదలైన  'కింగ్ స్టన్' చిత్రంలో కలిసి నటించారు. గతంలో  'బ్యాచిలర్ ' అనే మూవీలో కూడా నటించారు. ఇదిలా ఉంటే జీవి ప్రకాష్ -సైంధవి వైవాహిక బంధం విడిపోయినప్పటికీ, వృత్తిపరంగా కలిసి పనిచేయడం కొనసాగిస్తున్నారు.ఇటీవలే మలేషియాలో జరిగిన ఒక సంగీత కచేరీలో జి.వి. ప్రకాష్ కుమార్‌తో కలిసి సైంథవి పాడటం గమనార్హం.

Also Read:ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది?

cinema-news | latest-news | telugu-news | gv-prakash-and-saindhvavi 

Advertisment
తాజా కథనాలు