/rtv/media/media_files/2024/11/21/mTXrUuUc9FIBOpDAzjvS.jpg)
vishal health update
Actor Vishal: తమిళ హీరో, నిర్మాత మండలి మాజీ అధ్యక్షడు విశాల్ థియేటర్లు ముందు పబ్లిక్ రివ్యూలు ఆపేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇటీవలే పాల్గొన్న 'రెడ్ ఫ్లవర్' అనే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశాల్ దీని గురించి మాట్లాడారు. ముఖ్యంగా మొదటి 12 షోలకు అంటే విడుదలైన ఉదయం నుంచి సాయంత్రం వరకు థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే యూట్యూబర్లను రివ్యూలు అడగడానికి అనుమతించవద్దని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ను అభ్యర్థించారు.
విశాల్ ఇంకా మాట్లాడుతూ.. కొందరు యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు రాగానే రివ్యూ అడుగుతుంటారు. కానీ, దానికంటే ముందు యూట్యూబర్లు కూడా సినిమా చూసి.. ముందుగా వారి రివ్యూ ఇచ్చి, ఆపై ప్రజల అభిప్రాయాలను అడిగితే బాగుంటుందని అన్నారు. సినిమాకు రివ్యూ అనేది అవసరం.. కానీ ఆ మొదటి 12 షోలకు సినిమా కాస్త ఊపిరిపీల్చుకునే సమయాన్ని ఇవ్వాలని కోరారు.
#Vishal has requested theatre owners to prohibit public YouTube reviews inside theatre premises for the first 3 days after a film's release, public reviews can be allowed pic.twitter.com/p12cz9DrrS
— Milagro Movies (@MilagroMovies) July 16, 2025
విశాల్ ఎందుకు ఇలా కోరారు?
అయితే ఒక సినిమాకు విడుదలైన మొదటి రోజు, మొదటి 12 షోలు చాలా కీలకమైనవి. ఈ సమయంలోనే సినిమాకు అసలైన హైప్ (క్రేజ్) వస్తుంది. కానీ, కొంతమంది యూట్యూబర్లు లేదా ఇతర వ్యక్తులు థియేటర్ల వద్ద నిలబడి, సినిమా చూడగానే ప్రేక్షకుల అభిప్రాయాలను అడుగుతారు. ఈ సమయంలో కొందరు సినిమాపై సరైన అవగాహన లేకుండానే నెగటివ్ రివ్యూలు ఇవ్వవచ్చు. ఇది సినిమా చూడాలనుకునే మిగతా ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తుంది. ఈ నెగటివ్ టాక్ సినిమా కలెక్షన్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల నిర్మాతలు, పంపిణీదారులు నష్టపోతారు. అందుకే విశాల్ మొదటి రోజు థియేటర్ వద్ద రివ్యూలు ఆపేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు