Sai kiran: మేనకోడలిని పెళ్లి చేసుకోబోతున్న 46ఏళ్ల హీరో! ఎవరో తెలుసా? సీరియల్ నటుడు సాయి కిరణ్ రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు. తాజాగా నటి స్రవంతితో నిశ్చితార్థం జరిగినట్లు ఇన్స్టా వేదికగా అనౌన్స్ చేశారు. స్రవంతి 'కోయిలమ్మ' సాయి కిరణ్ కోడలి పాత్రలో నటించింది. అయితే 2010లో సాయికిరణ్‌కి వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లవగా.. విడిపోయారు. By Archana 11 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update serial actor sai kiran షేర్ చేయండి Sai Kiran: నటుడు సాయికిరణ్ 'ప్రేమించు' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో', 'జగపతి', 'షిరిడి సాయి', 'నక్షత్రం' తదితర చిత్రాల్లో నటించాడు. కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన సాయి కిరణ్ కు.. సీరియల్స్ లో అవకాశాలు రావడంతో ఆ దిశగా అడుగులు వేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సీరియల్స్‌లో పనిచేశారు. తెలుగులో 'గుప్పెడంత మనసు', 'కోయిలమ్మ', 'పడమటి సంధ్యరాగం' సీరియల్స్ తో బుల్లితెర పై సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్ రెండో పెళ్ళికి సిద్దమైన సాయి కిరణ్ ఇది ఇలా ఉంటే.. 46 ఏళ్ళ సాయి కిరణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా నటి స్రవంతిని ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఇన్స్టా వేదికగా అనౌన్స్ చేశారు. నటి స్రవంతి, సాయి కిరణ్ 'కోయిలమ్మ' సీరియల్లో కలిసి నటించారు. ఇందులో స్రవంతి సాయి కిరణ్ మేనకోడలి పాత్రలో నటించింది. అయితే సాయి కిరణ్ కి ఇది రెండో పెళ్లి. 2010లో వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయింది. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం. కాగా కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు. సాయి కిరణ్ నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తోటి నటీనటులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Also Read: 'పుష్ప 2' విషయంలో దేవీకి దెబ్బేసిన సుకుమార్.. ఇక కెరీర్ కష్టమేనా..! View this post on Instagram A post shared by Actress Sravanthi (@sravanthi.official) Also Read: ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ! Also Read: రింగు రింగుల జుట్టు.. వంకాయ్ కలర్ శారీ.. అనుపమను ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే! #guppedantha manasu Sai Kiran #Sai Kiran Engagement #actor sai kiran మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి