Prabhas: మనకు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ .. ప్రభాస్ వీడియో వైరల్

డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రభాస్ తన వంతు సహకారాన్ని అందించారు. యువతకు డ్రగ్స్ పై అవేర్నెస్ కల్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update

Prabhas: డార్లింగ్.. ఈ పదం వినగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. షూటింగ్స్ తప్పా, పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉండే ఈ పాన్ ఇండియా హీరో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. డ్రగ్స్ వద్దు డార్లింగ్స్ అంటూ సందేశం ఇస్తున్నాడు. 

Also Read:యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..?

మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా టాలీవుడ్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి తనవంతుగా సహాయసహకారాలు అందించాడు. "మనకు ఎంజాయ్ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి, ఎంతో ఎంటర్ టైన్ మెంట్ ఉంది, అలాంటప్పుడు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్"  అంటూ యువతకు డ్రగ్స్ పై అవేర్నెస్ కల్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు ప్రభాస్.  మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు  తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్, అడివి శేష్, ఎన్టీఆర్ పలువురు స్టార్స్ డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ వంతు సహకారం అందించారు. తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ హీరోలు ఇంత క్లోజ్ గా పనిచేయడం, ఇంతమంది ఒకే సారి ముందుకురావడం ఇదే తొలిసారి.

Also Read: New Year 2025: న్యూ ఇయర్ రోజున ఈ పనుల్లో ఒకటైన చేయండి.. అన్ని శుభాలే

ప్రస్తుతం ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడీ  తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. మారుతీ దర్శకతవరంలో రాజా సాబ్ , సందీప్ వంగ కాంబోలో స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది . 

Also Read:ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

Advertisment
తాజా కథనాలు