Pavala Shyamala: ఆత్మహత్యకు తల్లీకూతుళ్ళు యత్నం...దయనీయ స్థితిలో పావలా శ్యామల

క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.  ఆమె ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా శ్యామల, ఆమె కూతురు ఆత్యహత్యకు కూడా యత్నించినట్లు తెలుస్తోంది. 

New Update
pavala shyamala

నటి, కామెడీ యాక్టర్ పావలా శ్యామల గురించి అందరికీ తెలిసిందే ఒకప్పుడు సినిమాల్లో వేషాలేస్తూ బాగానే బ్రతికిన ఆమె ప్రస్తుతం చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. తినడానికి తిండి, ఉండడానికి గూడు..సరైన ఆరోగ్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఆదుకునే వారు లేక శ్యామల ఆమె కూతురు కష్టాలు పడుతున్నారు. దానికి తోడు ఆరోగ్యం కూడా బాగా క్షీణించడంతో శ్యామల ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. ఈ కారణంతో హోమ్ నిర్వాహకులు ఆమెను, కూతురుని అక్కడ నుంచి బయటకు పంపించేశారు. దీంతో తల్లీకూతుళ్ళు ఇద్దరూ రోడ్డుపై ఆత్మహత్య చేసుకోబోయారు. వీరిని గుర్తించిన పోలీసులు ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. దీనిపై  ఇప్పటి వరకు సీనీ పెద్దలు ఎవరూ స్పందించలేదు. 

చాలా ఏళ్ళుగా దీనస్థితిలో..

చాలా ఏళ్ళుగా సినిమాల్లో నటించడం మానేసిన దగ్గర నుంచీ పావలా శ్యామల కష్టాలను ఎదుర్కొంటున్నారు.  50 ఏళ్లుగా నటిగా కష్టపడి జీవించాను. కానీ గత మూడు సంవత్సరాలుగా నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా దీనిని వివరించాను. కానీ ఎవరూ స్పందించలేదు. ఎలాగో ఇంత‌వ‌ర‌కు వ‌చ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో బతుకుతున్నాను. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి ప్రముఖ హీరోలందరితో నటించాను అని ఇంతకు ముందు కూడా చెప్పారు. కొంత కాలం క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పావలా శ్యామలను ఆదుకున్నారు. దాని తరువాత కూడా సాయి ధరమ్ తేజ్, ఆకాశ్ పూరి లాంటి వారు ఆమెకు సహాయం చేశారు. అయితే వారందరూ చేసిన సహాయాలు కొద్ది రోజుల వరకే సరిపోతున్నాయని..తర్వాత తన పరిస్థితి మళ్ళా దిగజారుతోందని పావలా శ్యామల చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు