Muzammil Ibrahim: దీపికకు నేనంటే చాలా ఇష్టం.. నాతో రెండేళ్లు తిరిగింది: మాజీ ప్రియుడు సంచలనం!

బాలీవుడ్ నటుడు, మోడల్ ముజమ్మిల్ ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను రెండేళ్ల పాటు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

New Update

Muzammil Ibrahim:  బాలీవుడ్ నటుడు,  మోడల్ ముజమ్మిల్ ఇబ్రహీం  వ్యాఖ్యలతో నటి స్టార్ దీపికా పదుకొనే మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముజమ్మిల్ దీపికా గురించి సంచలన కామెంట్స్ చేశాడు. గతంలో తాను, దీపికా రెండేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నామని చెప్పాడు. అయితే  2000లో దీపికా మోడలింగ్ కెరీర్ కోసం ముంబైకి వచ్చిన  తొలినాళ్లలో తనకు ఆమెతో  పరిచయం ఏర్పడిందని తెలిపాడు. అంతేకాదు దీపికా ముంబైకి వచ్చిన తర్వాత ఆమెకు పరిచయమైన మొదటి వ్యక్తి తానేనని ముజమ్మిల్ చెప్పారు. అలా తామిద్దరూ మోడలింగ్ రంగంలో కొనసాగుతున్న సమయంలో రిలేషన్ షిప్ మొదలైనట్లు వెల్లడించాడు. 

Also Read:భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

నేనే బ్రేకప్ చెప్పా!

ముజమ్మిల్ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నాడు. ముందుగా దీపికానే తనకు ప్రపోజ్ చేసిందని.. కానీ తానే ఆ రిలేషన్ షిప్ బ్రేక్ చేసుకున్నానని తెలిపాడు. అప్పట్లో తమతో ఎక్కువగా డబ్బు లేదని.. ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడేవాళ్లమని ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నాడు. ఆటో రిక్షాలో వర్షంలో  దీపికా, తాను డేట్స్ కి వెళ్లేవాళ్లమని చెప్పాడు. అయితే దీపికా పుట్టినరోజున తనతో డబ్బు లేకపోయినా,  తన DJ స్నేహితుడు సహాయంతో ఆమెకు నచ్చిన పాటను గంటన్నర పాటు ప్లే చేయించి సర్ప్రైజ్ చేశాను అంటూ దీపికతో తన ప్రేమ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. 

Also Read: Bunny Vasu OTT Controversy: పెద్ద హీరోలదే తప్పు.. థియేటర్ల వివాదం పై నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్!

Advertisment
తాజా కథనాలు