Actor Mohan Raj:నటుడు మోహన్‌ రాజ్‌ కన్నుమూత!

తెలుగుతో పాటు ఇతర సౌత్‌ ఇండియా భాషల్లో విలన్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు మోహన్‌ రాజ్‌ గురువారం కన్నుమూశారు. తెలుగులో లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌ స్పెక్టర్‌ వంటి సినిమాలతో పాటు అనేక చిత్రాల్లో నటించారు.

New Update
actor mohan

Actor Mohan Raj: తెలుగుతో పాటు ఇతర సౌత్‌ ఇండియా భాషల్లో విలన్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు మోహన్‌ రాజ్‌ కన్నుమూశారు. తిరువనంతపురంలోని తన నివాసంలో గురువారం మోహన్‌ రాజ్‌ తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల కిందట ఓ తెలుగు చిత్రంలో యాక్షన్ సన్నివేశంలో చేస్తుండగా ఆయన కాలికి తీవ్ర గాయమైంది.

Also Read: ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణుదాడి..భారత్‌కు పొంచి ఉన్న ముప్పు

 ఆ గాయం ఆయన కెరీర్ ను దెబ్బతీసింది. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. ఆరడుగుల ఎత్తుతో విలనిజానికి పెట్టింది పేరుగా కనిపించే మోహన్‌ రాజు తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. 1989లో వచ్చిన 'కిరీడమ్' సినిమాతో ఆయన సినీ కెరీర్‌ మొదలైంది. ఆ సినిమా తరువాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. 

Also Read: తెలంగాణలో  రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వానలు!

మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళ సినీ చరిత్రలోనే సూపర్‌  హిట్ గా నిలిచింది. ఆయన కెరీర్ లో 300కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనూ ఆయన అనేక చిత్రాల్లో నటించారు. 90వ దశకంలో వచ్చిన తెలుగు చిత్రాల్లో అగ్రహీరోల సినిమాల్లో మోహన్ రాజ్ విలన్ పాత్రలు చేశారు. బాలకృష్ణ, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి హీరోలకు ప్రతినాయకుడిగా మెప్పించారు. 

Also Read: టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు...!

రెండేళ్ల కిందట మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన 'రోర్షాచ్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ రాజ్ ఆఖరిగా నటించారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన అంత్యక్రియలు రేపు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు.

Also Read: నస్రల్లా వారసుడి లక్ష్యంగా బీరూట్‌ పై దాడి!

Advertisment
Advertisment
తాజా కథనాలు