ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణుదాడి..భారత్‌కు పొంచి ఉన్న ముప్పు

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ముదురుతోంది.ఇరాన్‌పై ప్రతిదాడులకు ఇజ్రాయెల్ తయారవుతున్న నేపథ్యంలో..మూడో ప్రపంచ యుద్ధానికి ప్రారంభమేనని చాలా మంది భావిస్తున్నారు.ఈ క్రమంలో ఇజ్రాయెల్ అణు దాడులకు కూడా సిద్ధమవుతోంది.అదే కనుక జరిగితే భారత్ కు ముప్పు తప్పదు.

author-image
By Manogna alamuru
New Update
1

Israel Attacks With Nuclear Bombs On Iran?

మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అంటూ అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం దీనికి ప్రారంభమేనని అంటున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోవడంతో.. ఇరాన్, ఇజ్రాయెల్ మీద దాడులకు దిగింది. ఒకేసారి 200 కన్నా ఎక్కువ క్షిపణులతో అటాక్ చేసింది.  ఈ దాడి ఇజ్రాయెల్ అంతటా అలజడి సృష్టించింది. పౌరులు సురక్షిత బంకర్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఇరాన్ క్షిపణి దాడులతో చివరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ కూడా బంకర్ లోకి పరుగులు తీశారని వార్తలు వచ్చాయి. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, సరైన సమయంలో భారీ స్థాయిలో ప్రతి దాడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే కనుక జరిగితే ఇజ్రాయెల్ పై పూర్తి స్థాయి యుద్ధం తప్పదని ఇరాన్ కూడా హెచ్చరించింది. ఈ వార్‌‌లో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. తమ ఫుల్ సపోర్ట్ ఉంటుందని బహిరంగంగానే ప్రకటించింది. 

ఒకప్పుడు స్నేహం–ఇప్పుడు వైరం

ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు 1990 తర్వాత బద్ధశత్రువులుగా మారిపోయాయి. ఒకప్పుడు ఆ రెండు దేశాలను ఏకం చేసిన భౌగోళిక రాజకీయ అంశాలు, అరబ్ సోషలిజం, సోవియట్ ప్రభావం,  ఇరాక్ తో శత్రుత్వం అన్ని అంతమయ్యాయి. 1990 తర్వాత ఇరాన్ విప్లవాత్మక ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఇజ్రాయెల్ పోర్ట్ చేయడానికి నిరాకరించింది. దాంతో పాటూ వ్యతిరేక భావజాలాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ఇరాన్ హిజ్బుల్లా, హమాస్ వంటి తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం కడ ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. 2000లో మహమూద్ అహ్మదీజానె ఇరాన్ అధ్యక్షుడు అయ్యాక ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. ఇరాన్‌ ఇజ్రాయెల్ ను బద్ద శత్రువుగా మార్చింది. ఇజ్రాయెల్ 2006లో హిజ్బుల్లా, 2008లో హమాస్‌తో యుద్ధాలు చేసింది. అప్పుడు కూడా ఇరాన్ ఈ రెండు సంస్థలకూ మద్దతుగా నిలబడింది. అదే ఇపుడు కూడ చేస్తోంది. దీంతో ఇప్పుడు వార్ ఇజ్రాయెల్–ఇరాన్ ల మధ్యదిగా మారిపోయింది. 

అణుబాంబు భయం..

మధ్య ప్రాచ్యంలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు పక్క దేశాలకు తలనొప్పిగా మారాయి. అదీ కాకుండా ఇజ్రాయెల్...ఇరాన్ మీద అణు బాంబును ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తోంది.  వరల్డ్‌ వార్‌‌–2లో అమెరికా , జపాన్ మీద అణుబాంబును ప్రయోగించింది. ఆ తరువాత ఎప్పుడూ ఎవరి మీదా ఈ ప్రయోగం జరగలేదు. అయితే అన్ని దేశాలు ప్రస్తుతం అణు బాంబులను కలిగి ఉన్నాయి.  అమెరికా..జపాన్ మీద అణుబాంబును ప్రయోగించినప్పుడే చాలా నష్టం వాటిల్లింది. దీని వల్ల అక్కడ రెండు పట్టణాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. మారణహోమం జరిగింది. తర్వాత కూడా చాలా ఏళ్ళ వరకూ ప్రజలు దాని ప్రభావాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే జపాన్ ఆ జ్ఞాపకాలను తుడిచేసుకుని మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ఈ ప్రయోగంతో మొత్తం ప్రపంచం పెద్ద గుణపాఠం నేర్చుకుంది అణుబాంబులకు దాదాపు అందరూ వ్యతిరేకంగా తయారయ్యారు. వరల్డ్‌ వార్ –2 తర్వాత కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగినా...అణు బాంబుల వరకూ వెళ్ళలేదు. రీసెంట్‌గా జరిగిన, జరుగుతున్న రష్యా‌‌–ఉక్రెయిన్ వార్‌‌లో కూడా వీటి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య వార్‌‌లో అణుబాంబు సంగతి వచ్చేసరికి మరో సారి ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద అణు బాబు ప్రయోగిస్తే...ఆ దేశంతో పాటూ చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. భౌగోళికంగా, ఆర్ధికంగా అతలాకుతలం అయిపోతాయి. ఈ కారణంగానే అణుబాంబు విషయంలో అమెరికా కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వమని కచితంగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనో అణు బాంబు ప్రయోగాన్ని సమర్ధించేది లేదని తేల్చి చెప్పేసింది. 

భారత్ పరిస్థితి..

ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద అణు బాంబును ప్రయోగిస్తే ఎఫెక్ట్ అయ్యే దేశాల్లో ఇరాన్ కచ్చితంగా ఉంటుంది. ఇండియాకు ఇరాన్ ఎంతో దూరంలో లేదు. ఫ్లైట్‌లో కేవలం మూడున్నర గంటల ప్రయాణం మాత్రమే.  భౌగోళికంగా చూస్తే రాజస్తాన్, జైపూర్, జమ్మూ–కాశ్మీర్‌‌ లాంటి రాష్ట్రాలు ఇరాన్ వైపుకే ఉంటాయి. ఇరాన్ కు, ఇండియాకు మధ్య పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ లెక్కన ఇజ్రాయెల్ ఇరాన్ మీద కనుక అణు ప్రయోగం చేస్తే పాకిస్తాన్, ఆప్​గనిస్తాన్‌తో పాటూ ఇండియా కూడా తీవ్రంగా ఫెక్ట్ అవుతుంది. మిగతా రెండు దేశాలు డైరెక్ట్‌గా బాంబు ప్రయోగానికే నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే...మన దేశానికి కనీసం దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ అయినా హిట్ అయ్యే ఛాన్స్‌లు చాల ఎక్కువగానే ఉన్నాయి.  అమెరికా...జపాన్ మీద అణుబాంబు వేసినప్పుడు కేవలం అక్కడ ఉన్న రెండు సిటీస్ మాత్రమే దెబ్బ తిన్నాయి. దానికి కారణం అణు ప్రయోగం జరిగిన నాగసాకీ, హిరోషిమా ఒక మూలకు ఉండడం..తర్వాత సముద్రం తప్పు మరే ఇతర దేశాలు లేకపోవడం. జపాన్ కూడా ఆసియా దేశాల్లో ఒక్కటే అయినా మిగతా దేశాలకు కానీ...జపాన్‌లోనే ఇతర ప్రాంతాలకు గానీ ముప్పు కలవకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. కానీ ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అలా కాదు. చుట్టూ మిగతా దేశాలున్నాయి. అదీ కాక ఇప్పుడు అన్ని రకాలుగా కూడా పరిస్థితులు మారిపోయాయి. జపాన్ మీద అమెరికా ప్రయోగించిన అణుబాంబు అప్పుడే తయారు చేసింది. అప్పుడే అణు బాంబును కనిపెట్టడం...అదే మొదటి ప్రయోగం కూడా. కానీ ఇప్పుడు సాంకేతికంగా, శాస్త్ర పరంగా కూడా అన్ని దేశాలు చాలా అభివృద్ధి చెందాయి. అణు బాంబుల తయారీలో కూడా. కాబట్టి ఇప్పుడు ఈ బాంబులు మరింత మోత మోగిస్తాయి. క్షిపణుల దాడికే దేశాలు దద్ధరిల్లుతున్నాయి అంటే..అణుబాంబులు వేస్తే ఏమయిపోతాయో కూడా ఊహించుకోవడం కష్టం. ఇప్పుడు ఈ బాంబులతో వచ్చిన ఎఫెక్ట్ ను వదిలించుకోవడం కానీ, దాని నుంచి కోలుకోవడం కానీ చాలా కష్టం. ఇరాన్ అయితే ప్రపంచ పటం నుంచి పూర్తిగా మాయం అయిపోతుంది. పక్క దేశాలు అయిన పాకిస్తాన్, భారత్‌ల కూడా ఆ ఎఫెక్ట్ కు తరతరాలు బలి కావల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ అణుబాంబు ప్రయోగం గురించి మన దేశం చాలా భయపడుతోంది. అమెరికా కూడా ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకమనే చెబుతోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు