SSMB29 Rajamouli: కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో! SSMB29 కోసం భారీ ప్లానింగ్

ఎస్.ఎస్.రాజమౌళి SSMB29 షూటింగ్ లో భాగంగా కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాదిని మరియు ఇతర ప్రతినిధులను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను ముదావాది తన ట్విట్టర్ లో పంచుకున్నారు.

New Update
Rajamouli met Kenya minister

Rajamouli met Kenya minister

SSMB29 Rajamouli:  'RRR' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'SSMB29'. తొలిసారి రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి కూడా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. హాలీవుడ్ చిత్రం 'ఇండియానా జోన్స్' తరహాలో ఇది ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇదొక విజువల్ వండర్ గా ఉండబోతుందని టాక్. ఇందుకోసం రాజమౌళి చిత్రబృందం దేశవిదేశాల్లోని అందమైన లొకేషన్స్ ని షూటింగ్ కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవలే  ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి  కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదవాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. షూటింగ్ కి కావాల్సిన అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాసేపు కాసేపు ముచ్చటించిన రాజమౌళి సినిమాకు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.  ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను మంత్రి ముదావాది తన ట్విట్టర్ లో పంచుకున్నారు.  కెన్యాలోని సుందరమైన ప్రదేశాలను తన చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు  రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

కెన్యా మంత్రి ట్వీట్ 

''ప్రపంచంలోనే గొప్ప దర్శకులలో ఒకరైన ఎస్.ఎస్. రాజమౌళికి గత పదిహేను రోజులుగా కెన్యా వేదికగా మారింది. భారతీయ దర్శకుడిగా, కథకుడిగా, రచయితగా ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 20 ఏళ్లకు పైగా సినీ కెరీర్ లో రాజమౌళి బలమైన కథాంశాలు, అద్భుతమైన విజువల్స్, లోతైన అంశాలతో సినిమాలు తీయడంలో పేరు పొందారు.  తూర్పు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత.. 120 మంది సభ్యులతో కూడిన రాజమౌళి టీమ్ కెన్యాను ఎంచుకుంది. ఆఫ్రికాలో చిత్రీకరించాలిసిన సన్నివేశాల్లో దాదాపు 95% షూటింగ్ ఇక్కడే చేశారు. '' 

120 దేశాల్లో విడుదల 

''మసాయి మారా మైదానాల నుంచి  సుందరమైన నైవాషా, సంబురు,  అంబోసెలి వంటి కెన్యా అందమైన ప్రాంతాలు ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద సినిమాలో భాగం కానున్నాయి. రాజమౌళి SSMB29 దాదాపు 120 దేశాల్లో విడుదల కానుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ ప్రేక్షకులకు చేరుకుంటుందని అంచనా! కెన్యాలో షూటింగ్ చేయాలనే ఈ నిర్ణయం కేవలం సినిమాకు సంబంధించినది మాత్రమే కాదు. మా దేశ గొప్పతనాన్నీ, ఆతిథ్యాన్ని, సుందరమైన ప్రదేశాలను ప్రపంచానికి చాటి చెప్పే వేదిక ఈ చిత్రం కానుంది. ఈ రోజు చిత్రబృందం నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఇండియాకు తిరిగి వెళ్తుంది.  'SSMB 29' ద్వారా కెన్యా తన  అందమైన  ప్రదేశాలను  ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉంది'' అంటూ ట్వీట్ చేశారు కెన్యా మంత్రి ముదావాది. 

Also Read: Kishkindhapuri Trailer: ''ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన''.. భయపెడుతున్న కిష్కిందపురి ట్రైలర్!

Advertisment
తాజా కథనాలు