ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై సినీ నటి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే బాధితురాలు హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారని, హర్షసాయి కావాలని చేయిస్తున్నాడని ఆరోపించింది. ట్రోలింగ్ చేసిన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. బాధితురాలు దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి: Women Harassment : రీల్ లైఫ్ హీరోలు..రియల్ లైఫ్ విలన్లు.. బయటపడుతున్న సెలెబ్రెటీల భాగోతాలు!
ప్రేమ పేరుతో మోసం..
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో మోసం చేశాడని, రూ.2 కోట్లు తీసుకుని వాడుకున్నాడని సినీ నటి హర్షసాయిపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి తనను రేప్ చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తర్వాత హర్ష సాయి కొన్ని రోజులు కనిపించలేదు. అయితే హైదరాబాద్‌లోని ఓ హోటల్లో తలదాచుకున్నాడని సమాచారం.
ఇది కూడా చూడండి: మహా కిలాడీలు.... నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ పేరుతో లక్షల్లో టోకరా!
సోషల్ మీడియాలో హర్ష సాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. యూట్యూబ్‌లో అతనికి మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోట్ చేస్తున్నాడని, వాటి నుంచి వచ్చిన డబ్బుతోనే ప్రజలకు సాయం చేస్తున్నాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. హర్ష సాయి బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది చనిపోయారని సోషల్ మీడియాలో బిగ్ వార్ కూడా జరిగింది. ఇటీవల ఆయనపై ఇలా వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.