/rtv/media/media_files/2025/06/30/aamir-khan-emotional-comments-2025-06-30-12-56-45.jpg)
aamir khan emotional comments
Aamir Khan: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాతో విడిపోయిన తర్వాత తాను అనుభవించిన చీకటి రోజుల గురించి ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2002లో రీనాతో విడాకుల తర్వాత తన జీవితం తలకిందులైందని తెలిపారు. ఆ సమయంలో ఎంతగానో బాధపడ్డానని అన్నారు. మద్యానికి బానిసయ్యానని, డిప్రెషన్ కి లోనయ్యానని తెలిపారు. అది తన జీవితంలోనే చీకటి దశలలో ఒకటి అని అన్నారు. 'లగాన్' విడుదలై తాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా కీర్తించబడుతున్న సమయంలోనే ఇదంతా జరిగిందని భావోద్వేగానికి గురయ్యారు. ఇది తెరపై ఆయన విజయాన్ని తెరవెనుక ఆయన చీకటి రోజులను చూపిస్తోంది.
Also Read: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
ప్రతిరోజూ మద్యం తాగాను!
అమీర్ ఇంకా మాట్లాడుతూ.. రీనాతో విడిపోయిన తర్వాత ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను! ఎప్పుడూ స్పృహ కోల్పోయేవాడిని తప్పా! నిద్రపోలేదు. నన్ను నేను నాశనం చేసుకోవాలని ప్రయత్నించాను . అప్పుడు సినిమాలు కూడా చేయలేదు. ఎవరినీ కలవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఒకరోజు ఓ వార్తాపత్రిక నన్ను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. అది చూసి నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు అమీర్.
అమీర్ ఖాన్ 1986 లో మొదటి భార్య రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2002లో 16 ఏళ్ల తన సుదీర్ఘ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాతో విడిపోయిన తర్వాత అమీర్ 2005 లో కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. మళ్ళీ 2021లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. వీరిద్దరికి జునైద్ ఖాన్, తాహిర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.