Aamir Khan: గత కొన్ని సంవత్సరాలుగా, సినీ పరిశ్రమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు వేగంగా మళ్లింది. చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే, ఈ విధానం వల్ల థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య గమనీయంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తన సినిమా విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన లేటెస్ట్ మూవీ 'సితారే జమీన్ పర్' డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి రూ. 120 కోట్ల డీల్ రాగా.. ఆయన తిరస్కరించినట్లు సమాచారం.
Also Read:Malavika Mohan: బ్యాంకాక్ లో చిల్ అవుతున్న 'రాజాసాబ్' బ్యూటీ.. ఫొటోలు చూశారా!
120 కోట్ల డీల్ రిజెక్ట్
థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ రప్పించే ప్రయత్నంలో భాగంగానే అమీర్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులకు ఇంటి వద్దే సినిమా చూసే అవకాశాన్ని వెంటనే ఇవ్వకుండా.. బిగ్ స్క్రీన్ అనుభవాన్ని ఎంచుకునేలా చేయాలనేదే అమీర్ ఆలోచనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి అమీర్ ఖాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
THIS IS IMPORTANT VERY IMPORTANT🔥#AamirKhan reportedly rejected a massive ₹125 crore OTT deal thus prioritizing THEATRICAL RELEASE over instant digital gains ! 💥🛐
— CineHub (@Its_CineHub) June 7, 2025
A STEP IN THE RIGHT DIRECTION ! 👌🏻🙏🏻 pic.twitter.com/anDjFM13Wx
అమీర్ ఖాన్, జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రల్లో నటించిన 'సితారే జమీన్ పర్' చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. 2007లో సూపర్ హిట్ గా నిలిచిన 'తారే జమీన్ పర్' సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.