21Years For Arya:  ఫీల్ మై లవ్.. అల్లు అర్జున్ 'ఆర్య' మెమొరీస్.. బన్నీ ఎక్స్ లో ఫొటోలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సూపర్ హిట్ లవ్ స్టోరీ 'ఆర్య' జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమా విడుదలై నేటితో 21 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా  'ఆర్య' షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు బన్నీ.

New Update

21Years For Arya:  2004లో విడుదలైన అల్లు అర్జున్ 'ఆర్య' మూవీ క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో యూత్ బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. డైరెక్టర్ సుకుమార్ కూడా తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో 'ఆర్య' ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ప్రతీది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో అల్లు అర్జున్ జోడీగా సుకృతి కణుగంటి నటించారు. యాక్టర్ శివ బాలాజీ మరో కీలక పాత్ర పోషించారు. 

అల్లు అర్జున్ ఆర్య మెమొరీస్ 

అయితే ఈ సినిమా విడుదలై నేటితో 21 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి 'ఆర్య' జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఎక్స్ లో 'ఆర్య' షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.  ఆర్య కేవలం సినిమా కాదు, నా జీవితాన్ని శాశ్వతంగా మార్చిన ప్రయాణానికి నాంది. ఆ ప్రేమ, జ్ఞాపకాలు,  ఇప్పటికీ జీవించి ఉన్నందుకు కృతజ్ఞతలు. 🖤 #21YearsForArya అంటూ ట్వీట్ చేశారు. 

#AA22

ఇదిలా ఉంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రాబోతున్న #AA22 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతనెల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. 

#21YearsForArya telugu-news | latest-news | 21 years for arya director-sukumar

Advertisment
Advertisment
తాజా కథనాలు