Shock To YCP : వైసీపీ(YCP) కి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా(Social Media) ఇంఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి(Sajjala Bhargav Reddy) పై కేసు నమోదైంది. టీడీపీ(TDP) నేత వార్ల రామయ్య ఫిర్యాదు మేరకు స్పందించిన ఈసీ భార్గవ్ పై కేసు నమోదు చేయాలని సీఐడీ కి ఆదేశాలు ఇచ్చింది. భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా టీమ్ లను నిందితులుగా చేర్చుతూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. పెన్షన్లను చంద్రబాబు ఆపించారని IVR కాల్స్ ద్వారా వైసీపీ టీమ్ ప్రచారం చేశారని ఎన్నికల సంఘానికి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
ALSO READ: నాకు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన కవిత
ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్…
ల్యాండ్ టైటిలింగ్ చట్టం(Land Titling Act) పై ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ఫిర్యాదు మేరకు అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్ పేరును చేర్చారు. అలాగే IVRS కాల్స్(IVRS Calls) చేసిన ఏజెన్సీ పైనా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఐడీ ఈరోజు చంద్రబాబు, లోకేష్ లను విచారించింది.