AP: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సీఐడీ.. మరో కేసు నమోదు!? టీడీపీ నాయకుడు చంద్రబాబుకు సీఐడీ మరో షాక్ ఇచ్చింది. ఎసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో ఏసీబీ కోర్టులో అభియెగ పత్రం దాఖలు చేసింది. దీంతో కేసును పరిశీలించాలంటూ ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. By srinivas 12 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Chendrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సీఐడీ మరో షాక్ ఇచ్చింది. ఎసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో ఏసీబీ కోర్టులో అభియెగ పత్రం దాఖలు చేసింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతిలో ఎసైన్డ్ భూముల ఇష్యూ 2020లో నమోదు చేసిన కేసులో నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే దీనిని పరిశీలించాలంటూ ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. 2020లో ఇచ్చిన ఫిర్యాదుతో.. ఈ మేరకు ఎసైన్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని యల్లమాటి ప్రసాద్‌కుమార్ 2020 ఫిబ్రవరి 27న ఇచ్చిన ఫిర్యాదుతో పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై నల్లూరు రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 మార్చి 3న మరోకేసు నమోదుచేసి, పలువురిని నిందితులుగా చూపించింది. 2022లో మాజీమంత్రి నారాయణను నిందితుల జాబితాలో చేర్చింది. సీఐడీ కేసుల్ని రద్దు చేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించగా.. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నిబంధనలను పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: TS DSC 2024: ఈ బుక్స్ చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. లిస్ట్ ఇదే! చంద్రబాబును నిందితుడిగా.. ఇక సోమవారం ఏసీబీ కోర్టులో 14/2020, 15/2020 క్రైం నంబర్లకు సంబంధించిన కేసులపై అభియోగపత్రం ఇచ్చింది. క్రైం నం. 14/2020లో చంద్రబాబును 40వ నిందితుడిగా చూపించింది. మరో 22 మందిని ఇందులో చేర్చాలని ఏసీబీ కోర్టులో సీఐడీ డీఎస్పీ మెమో సమర్పించారు. చంద్రబాబుతోపాటు, నారాయణ, తహశీల్దార్ సుధీర్‌బాబు, రామకృష్ణ, కేపీవీ అంజనీకుమార్‌ను నిందితులుగా పేర్కొన్నారు. అలాగే కొనుగోలు చేసిన ఎసైన్డ్ భూములకు భూసమీకరణ ప్రయోజనాలు పొందేందుకు అధికారులను ఒత్తిడి చేసి, నిబంధనలకు విరుద్ధంగా జీవో 41 జారీ చేయించారని తెలిపింది. ఎసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎసైనీదారులను భయాందోళనలకు గురిచేసి అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, బినామీలు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన్టుల సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు గుమ్మడి సురేశ్, కొల్లి శివరామ్, కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి కేపీవీ అంజనీకుమార్ మంత్రుల కుటుంబసభ్యులు బినామీలుగా వ్యవహరించారని ఆరోపించింది. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్‌ను ఒత్తిడి చేసి భూములను రిజిస్టర్ చేయించారని తెలిపింది. నారాయణ, ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కంపెనీల నుంచి రామకృష్ణ హౌజింగ్ సొసైటీ, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థల మధ్యవర్తులకు రూ.16.5 కోట్ల నిధులు వెళ్లాయని తెలిపింది. ఆ సొమ్మును ఎసైన్డ్ రైతులకు చెల్లించి నారాయణ బినామీలు అక్రమంగా విక్రయ దస్తావేజులు రాయించుకున్నారని ఆరోపించింది. #chandrababu #ap #cid #another-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి