Hyderabad: నిండు పోలీస్ ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్..

నిర్లక్ష్యం ఓ నిండు పోలీసు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో జరిగిన ఓ యాక్సిడెంటులో చార్మినార్ ఎక్సైజ్ సీఐ సాధిక్ అలీ మృతి చెందారు. ఇదే బైక్ మీదనున్న మరో ఎస్‌ఐ కి కూడా తీవ్రగాయాలపాలయ్యారు.

Hyderabad: నిండు పోలీస్ ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్..
New Update

CI Sadik Ali Died In Car Accident: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో (LB Nagar) నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో యూటర్స్ చేస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. కారు వెనుక వస్తున్న బైక్‌ను గుద్దింది. దీంతో బైక్‌ మీదనున్న ఇద్దరు కొంత దూరం ఎగిరి పడ్డారు. బైక్‌ మీద ఉన్న ఇద్దరూ పోలీసులు. ఇందులో చార్మినార్ ఎక్సైజ్‌కుపోలీస్ స్టేషన్ సీఐ సాధిక అక్కడిక్కడే మృతి చెందగా.. అదే బైక్ మీదనున్న ఎస్‌ఐ తీవ్రగాయాలపాలయ్యారు. ఇతను నారాయణగూడ (Narayanaguda) ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కుచెందిన ఎస్ఎస్ ఖాజావలీగా మొహయుద్దీన్ గా గుర్తించారు.

Also Read: రాజ్యసభకు ఫైర్ బ్రాండ్..తెలంగాణ నుంచి రేణుకా చౌదరి

ఫంక్షన్‌కు వెళ్ళి వస్తూ...

మలక్‌ పేటలో ప్రభుత్వ క్వార్టర్స్‌లో సీఐ సాదిక్ అలీ (CI Sadik Ali), ఎస్సై మొహియుద్దీన్ ఉంటున్నారు. వీరిద్దరూ ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళుతున్నారు. అలా వెళుతున్న దారిలో ప్రమాదం సంభవించింది. యాక్సిడెంట్ అయిన వెంటనే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ కారు వినుషా శెట్టి అనే పేరు మీద ఉన్నట్టు తెలిసింది. దీని మీద ఓవర్ స్పీడ్ చలాన్లు (Challans) చాలానే ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటూ డేంజర్ డ్రైవింగ్ చలాన్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు.

కారు డోర్‌ ఓపెన్ చేసిన డ్రైవర్?

పోలీసుల కథనం ప్రకారం ముందు వెళుతున్న కారు రాంగ్ రూట్‌లో యూటర్న్ తీసుకుంటోంది. వెనుక నుంచి సాదిక్ అలీ వాళ్ళు ఉన్న బైక్ వేగంగా వస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ యూటర్న్ తీసుకుంటున్న కారు డ్రైవర్..ఒక్కసారిగా కారు డోర్‌ను ఓపెన్ చేశాడు. దీంతో వెనుక వస్తున్న బైక్ ఒక్కసారిగా డోర్‌ను గుద్దుకుంది. దీంతో బైక్ మీద ఉన్న పోలీసులు ఇద్దరూ కింద పడి పోయారు. అయితే కారు డ్రైవర్ డోర్ ఎందుకు ఓపెన్ చేశాడో ఇంకా తెలియలేదు. కావాలని తీశాడా...లేక పొరపాటున జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో తీవ్రంగా గాయపడ్డ ఖాజా మొహయుద్దీన్‌ను ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

#accident #hyderabad #lb-nagar #ci-sadik-ali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe