Health News: చికిత్స లేని వ్యాధి.. లైంగిక కోరికలు రాకుండా చేసే ఈ రోగం గురించి తెలుసుకోండి! పేగులకు సంబంధించిన క్రోన్స్ వ్యాధి దేశంలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. విరేచనాలు, జ్వరం, అలసట, కడుపు నొప్పి, తిమ్మిరి, మలవిసర్జన నుంచి రక్తస్రావం లాంటి లక్షణాలు ఈ వ్యాధికి సంబంధించినవే. ఈ వ్యాధి సోకితే లైంగిక కోరికలు తగ్గుతాయని సమాచారం. By Vijaya Nimma 04 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health News: క్రోన్స్(Chron's) వ్యాధి కేసులు ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్నాయి. ఒక్క అమెరికాలోనే ఏడు లక్షల మందికిపైగా దీని బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పేగులకు సంబంధించిన వ్యాధి. ఇప్పటివరకు ఈ వ్యాధికి నిర్దిష్ట చికిత్స లేదు. కొన్ని సంవత్సరాలుగా క్రోన్స్ వ్యాధి రోగుల సంఖ్య కూడా భారత్‌లో కూడా పెరిగింది. ప్రజలందరూ ఈ వ్యాధి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. రెండు పేగులపైనా ప్రభావం: ఈ వ్యాధి మీ జీర్ణవ్యవస్థలోని కణజాలాల వాపుకు కారణమవుతుంది. కడుపు నొప్పి, తీవ్రమైన విరేచనాలు, అలసట, బరువు తగ్గడంతో పాటు పోషకాహార లోపాన్ని కలిగిస్తుంది. క్రోన్స్ వ్యాధిలో మంట కారణంగా జీర్ణవ్యవస్థ నెగిటివ్‌గా ప్రభావితమవుతుంది. కొంతమందిలో ఈ మంట సమస్య పేగుల లోతులకు కూడా వ్యాపిస్తుంది. క్రోన్స్ వ్యాధి ప్రభావం చిన్న, పెద్ద రెండిటి పేగులపైనా ఉంటుంది. ఈ వ్యాధిని సకాలంలో నయం చేయకపోతే కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. లక్షణాలు: సాధారణంగా ఈ వ్యాధి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. కానీ కొన్నిసార్లు లక్షణాలు హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా సంభవించవచ్చు. క్రోన్స్ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం, దానిని సకాలంలో గుర్తించడం అవసరం. క్రోన్స్ వ్యాధి విరేచనాలు, జ్వరం, అలసట, కడుపు నొప్పి, తిమ్మిరి, మలవిసర్జన నుంచి రక్తస్రావం, తరచుగా నోటి పూతల, ఆకలి లేకపోవడం లాంటి వాటికి కారణమవుతుంది. కాలక్రమేణా చర్మం, కీళ్ళలో వాపు, మూత్రపిండాల్లో రాళ్ళు లాంటి సమస్యలు కూడా ఉండవచ్చు. క్రోన్స్ వ్యాధి ఉన్న మహిళలకు హార్మోన్ల రుగ్మతల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్రమరహిత రుతుస్రావ ప్రమాదాన్ని పెంచే వ్యాధి ఇది. ఈ వ్యాధి సోకితే లైంగిక కోరికలు తగ్గుతాయి. ధూమపానం అలవాటును విడిచిపెట్టడం ఈ తీవ్రమైన వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. ఇది కూడా చదవండి: ఎక్స్పైరీ అయిపోయిన సామగ్రీతో మేకప్..దారుణంగా మారిపోతున్న ముఖాలు! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-benefits #health-care #chrons-disease మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి