Thangalaan : 'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కోసం అన్ని నెలలు ఆగాల్సిందే?

విక్రమ్ 'తంగలాన్' మూవీ ఆగస్టు 15న రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. కాగా ఈ మూవీ ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. డీల్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.

Thangalaan : 'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కోసం అన్ని నెలలు ఆగాల్సిందే?
New Update

Thangalaan Movie : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'తంగలాన్' ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపొందింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో విక్రమ్ నటన, ఆయన కనిపించిన తీరు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

విక్రమ్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విధమైన పాత్రలో కనిపించారు. దీంతో థియేటర్స్ లో ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే 'తంగలాన్' ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ్ తో పాటూ మొత్తం ఐదు భాషల ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

Also Read : సస్పెన్స్ కు తెర.. తలపతి విజయ్ లాస్ట్ సినిమాకు దర్శకుడు ఖరారు, ఎవరంటే?

అయితే సినిమా రిలీజైన ఎనిమిది వారాలు అంటే సరిగ్గా రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన 'తంగలాన్' అక్టోబర్ సెకండ్ వీక్ లో ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్ పార్వతి తిరువోతు హీరోయిన్స్ గా నటించగా.. కలైరాణి, రంజిత్ జయకోడి వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు.

#chiyaan-vikram #thangalaan-ott-release
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe