Thalapathy 69 : సస్పెన్స్ కు తెర.. తలపతి విజయ్ లాస్ట్ సినిమాకు దర్శకుడు ఖరారు, ఎవరంటే? కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్.. విజయ్ లాస్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు స్వయంగా నిర్ధారించారు. తాజాగా ఆయన ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు.'విజయ్ చివరి సినిమాకు నేను దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది100% కమర్షియల్ ఎంటర్టైనర్' అని క్లారిటీ ఇచ్చారు. By Anil Kumar 16 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Thalapathy 69 Movie : తమిళ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్న విజయ్ 69వ సినిమా విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ విజయ్ లాస్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు స్వయంగా నిర్ధారించారు. తాజాగా దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రం గురించి ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు." విజయ్ చివరి సినిమాకు నేను దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది 100% కమర్షియల్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రంగా రూపొందుతుంది. రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఏమి ఉండవు" అని తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు చెప్పారు. కాగా వినోద్ ఇప్పటివరకు అజిత్త 'వలిమై', తునీవు (తెలుగులో తెగింపు) వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు విజయ్‌తో చేయడంపై తమిళనాట ఆసక్తి నెలకొంది. Also Read : ‘RRR’ లో మెయిన్ హీరో అతనే.. నటన అద్భుతం, హాలీవుడ్ స్టార్ ప్రశంసలు ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక విజయ్ త్వరలోనే 'ది గోట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానుంది. #h-vinoth #thalapathy-69-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి