Thangalaan : 'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కోసం అన్ని నెలలు ఆగాల్సిందే?
విక్రమ్ 'తంగలాన్' మూవీ ఆగస్టు 15న రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. కాగా ఈ మూవీ ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. డీల్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.