Tirumula: చిన్నారిని చంపేసిన చిరుత.. తిరుమల నడక మార్గంలో తీవ్ర విషాదం!

Tirumala : అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక లక్షిత మృతి చెందింది. ముందుగా లక్షిత తప్పిపోయిందని అంతా భావించగా.. పోలీసుల సేర్చ్‌ ఆపరేషన్‌లో లక్షిత మృతదేహం నరసింహ స్వామి ఆలయం వద్ద కనిపించింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇక గత జూన్ 23న కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. ఇలా వరుస పెట్టి చిరుతలు దాడి చేస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Tirumula: చిన్నారిని చంపేసిన చిరుత.. తిరుమల నడక మార్గంలో తీవ్ర విషాదం!
New Update

Tirumala Chirutha Attack on Kid: తిరుమల నడక మార్గంలో తీవ్ర విషాదం నెలకొంది. రాత్రి నడక మార్గంలో తప్పిపోయిన ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి లక్షితను చిరుత చంపేయడం తీవ్ర విషాదాన్ని నింపింది. నరసింహస్వామి ఆలయం దగ్గర చిన్నారి మృతదేహం కనిపించగా.. లక్షిత శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. ఇక గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. గత జూన్ 23న ఓ బాలుడిని లాక్కెళ్లింది చిరుత. బాలుడిపైనే దాడి చేయగా.. అప్పట్లో 24గంటల్లోనే చిరుతను పట్టుకుంది టీటీడీ.

అసలేం జరిగింది?
నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దినేశ్ కుటుంబం తిరుమల(Tirumala) వెళ్లేందుకు చాలా కాలం నుంచి ప్లాన్‌ వేసుకుంది. ఆ ప్లాన్‌కి తగ్గట్టుగానే ఎంతో ఆనందంగా.. భక్తిగా తిరుమల బయలుదేరింది. అలిపిరి నడకదారి మార్గంలో తిరుమలకు స్టార్ట్ అయ్యారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా పాప లక్షిత తమతో లేదన్న విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. లక్షిత ఎక్కడో తప్పిపోయి ఉంటుందని అంతా భావించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మిస్సింగ్‌ కేసే అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా పాప కనిపించలేదనే అనుకున్నారు కానీ చిరుత దాడి చేస్తుందని అసలు ఊహించలేకపోయారు.

publive-image

లక్షిత కోసం గాలించడం మొదలుపెట్టిన టీటీడీ (TTD) అటవీ శాఖ, విజిలెన్స్, పోలీసులకు నరసింహస్వామి ఆలయం వద్ద లక్షిత మృతదేహం కనిపించింది. లక్షిత శరీరంపై గాయాలు చూస్తే చిరుత దాడి చేసినట్టు వారికి క్లియర్‌గా అర్థమైపోయింది. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. పాపను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు బోరునా విలిపించారు. నిన్నమొన్నటి వరకు లక్షిత ముద్దుముద్దు మాటలతో మురిసిపోయిన ఆ కుటుంబసభ్యుల ముఖాల్లో ఇప్పుడు విషాదం తప్ప మరెదీ కనిపించని స్థితి. ఎంతో చలాకీగా ఉండే లక్షితను అలా చూసే సరికి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు.

publive-image

గతంలో బోనులో చిక్కిన చిరుత:
గత జూన్‌లో కూడా ఈ తరహా ఘటనే జరగగా.. అప్పుడు బాలుడు మాత్రం ప్రాణాలతో బతికాడు. అలిపిరి నడకదారి మార్గంలో ఆదోనికి చెందిన కుటుంబం తిరుమలకు నడిచి వెళుతుండగా.. ఏడో మైలు వద్ద బాలుడు తాతతో కలిసి ఓ షాపు దగ్గర స్నాక్స్ కొనుగోలు చేస్తున్నాడు.. ఇంతలో బాలుడిపై చిరుత దాడి చేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇక కంట్రోల్‌ రూం వద్ద బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది చిరుత. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించగా కోలుకున్నాడు. ఆ వెంటనే చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేయగా చిరుత చిక్కింది. ఏడాదిన్నర వయసు ఉన్న చిరుత కావడంతోనే బాలుడిని చంపకుండా ఉండింది. చిరుత బోనులో చిక్కడంతో అప్పట్లో భక్తులు ఊపిరి పీల్చుకోగా.. తాజాగా బాలికపై చిరుత దాడి చేయడం.. లక్షిత చనిపోవడంతో భక్తుల్లో ఆందోళన మళ్లీ పెరిగింది.

Also Read: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59కే నగరాన్ని చుట్టేయండి!

#tirumala #tirupati-chirutha-incident #chirutha #lakshitha-died #chirutha-attack-on-girl #chirutha-attack #leopord-attack #tirumala-chirutha-attack-on-kid #tirumala-chirutha-attack #chiruth-attack-in-tirumala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe